smart phones: హాస్పిటల్‌లో కరెంట్ కట్.. స్మార్ట్‌ఫోన్లతో చికిత్స

ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో రాత్రిపూట స్మార్ట్‌ఫోన్లతో డాక్టర్లు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తింది బిహార్‌లో. రాష్ట్రంలోని రోహ్‌తాస్ జిల్లా కేంద్రమైన ససారమ్‌లో సదర్ అనే ప్రభుత్వాసుపత్రి ఉంది.

smart phones: హాస్పిటల్‌లో కరెంట్ కట్.. స్మార్ట్‌ఫోన్లతో చికిత్స

Smart Phone Light

smart phones: ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో రాత్రిపూట స్మార్ట్‌ఫోన్లతో డాక్టర్లు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తింది బిహార్‌లో. రాష్ట్రంలోని రోహ్‌తాస్ జిల్లా కేంద్రమైన ససారమ్‌లో సదర్ అనే ప్రభుత్వాసుపత్రి ఉంది. ఇది స్థానికంగా పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. అయితే, ఈ ఆసుపత్రిలో తరచూ విద్యుత్ పోతోంది. దీంతో పేషెంట్లు, డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం రోజు కూడా రాత్రిపూట ఉన్నట్లుండి కరెంటు పోయింది. దీంతో అత్యవసర స్థితిలో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు చికిత్స అందించడం కష్టమవుతోంది. కరెంటు పోయినప్పుడు, జనరేటర్ లాంటి సౌకర్యం కూడా లేకపోవడంతో స్మార్ట్‌ఫోన్‌ లైట్‌నే టార్చ్‌లైట్ వాడుతున్నారు.

Janasena: కోనసీమలో చిచ్చుపెట్టింది ప్రభుత్వమే: నాదెండ్ల మనోహర్

స్మార్ట్‌ఫోన్ వెలుతురులోనే చికిత్స అందిస్తున్నారు. ఒక సివిల్ సర్జన్ పేషెంటుకు స్మార్ట్‌ఫోన్ వాడి చికిత్స అందించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ అంశంపై జిల్లా మెజిస్ట్రేట్ దృష్టి సారించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక టీమ్ ఏర్పాటు చేశారు. సివిల్ సర్జన్‌కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. అయితే, చాలా కాలం నుంచి ఇలా ఉన్నట్లుండి కరెంటు పోతోందని, దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించడంలేదని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.