IPL 2023: అత్యంత అరుదు.. గ‌త 8 మ్యాచుల్లో మొద‌ట బ్యాటింగ్ చేసిన జ‌ట్లే గెలిచాయ్‌.. ఎలాగో తెలుసా..!

ఈజీగా గెలుస్తాయ‌నుకున్న జ‌ట్లు సైతం ఛేజింగ్‌లో త‌డ‌బ‌డుతున్నాయి. స్వ‌ల్ప ల‌క్ష్యాల‌ను సైతం అందుకోలేక‌పోతున్నాయి. గ‌త 8 మ్యాచ్‌ల‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం అర్ధం అవుతుంది.

IPL 2023: అత్యంత అరుదు.. గ‌త 8 మ్యాచుల్లో మొద‌ట బ్యాటింగ్ చేసిన జ‌ట్లే గెలిచాయ్‌.. ఎలాగో తెలుసా..!

last 8 matches the teams who batted first won (pic ipl )

IPL 2023: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచుల్లో చివ‌రి బంతి వ‌ర‌కు ఎవ‌రు గెలుస్తారో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ఈజీగా గెలుస్తాయ‌నుకున్న జ‌ట్లు సైతం ఛేజింగ్‌లో త‌డ‌బ‌డుతున్నాయి. స్వ‌ల్ప ల‌క్ష్యాల‌ను సైతం అందుకోలేక‌పోతున్నాయి. గ‌త 8 మ్యాచ్‌ల‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం అర్ధం అవుతుంది. ఈ ఎనిమిది మ్యాచుల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జ‌ట్లు గెలుపొంద‌డం గ‌మ‌నార్హం. రెండోసారి బ్యాటింగ్ చేసిన జ‌ట్టు వ‌రుస‌గా ఎనిమిది మ్యాచుల్లో ఓడిపోవ‌డం అనేది అరుదు అనే చెప్పాలి.

– గ‌త శ‌నివారం ఐపీఎల్ 30వ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఈ సంప్ర‌దాయానికి తెర‌తీసింది. గుజ‌రాత్ టైటాన్స్ 135 ప‌రుగులు చేయ‌గా స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని అందుకోలేక 128 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో గుజ‌రాత్ 7 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

IPL 2023, LSG vs GT: చేజేతులా ఓడిపోయిన ల‌క్నో.. స్వల్ప ల‌క్ష్యాన్ని కాపాడుకున్న గుజ‌రాత్‌

– 31వ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 214 ప‌రుగులు చేయ‌గా ఛేద‌న‌లో ముంబై 201 ప‌రుగులు చేసింది. 13 ప‌రుగుల తేడాతో ముంబై ఓడిపోయింది.

– ఈ సారి రాజ‌స్థాన్ చితికిల ప‌డింది. 32వ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 189 ప‌రుగులు చేయ‌గా రాజ‌స్థాన్ 182 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఆర్‌సీబీ 7 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది.

– 33వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 235 ప‌రుగులు చేయ‌గా కోల్‌క‌తా 186 ప‌రుగులు చేసింది. దీంతో చెన్నై 49 ప‌రుగుల‌తో గెలిచింది.

– 34వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ హైద‌రాబాద్‌ను ఓడించింది. ఢిల్లీ 144 ప‌రుగులు చేయ‌గా హైద‌రాబాద్ 137 ప‌రుగులు చేసింది. ఢిల్లీ 7 ప‌రుగుల‌తో జ‌య‌భేరి మోగించింది.

IPL 2023 DC Vs SRH ఢిల్లీ చేతిలో హైదరాబాద్ ఓటమి

– 35వ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ 207 ప‌రుగులు చేయ‌గా ముంబై 152 ప‌రుగుల‌కే చేసింది. ఫ‌లితంగా గుజ‌రాత్ 55 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

– 36వ మ్యాచ్‌లో కోల్‌క‌తా 200 ప‌రుగులు చేయ‌గా ఆర్‌సీబీ 179కే ప‌రిమిత‌మైంది. 21 ప‌రుగుల‌కే ఆర్‌సీబీ ఓడింది.

– 37వ మ్యాచ్ గ‌త రాత్రి (గురువారం) రాజ‌స్ధాన్ 202 ప‌రుగులు చేయ‌గా చెన్నై 170 చేసింది. దీంతో రాజ‌స్థాన్ 32 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ గెలుపుతో రాజ‌స్థాన్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానానికి దూసుకువెళ్ల‌గా చెన్నై మూడో స్థానానికి ప‌డిపోయింది. మ‌రీ నేడు పంజాబ్ కింగ్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ్యాచ్‌లోనైనా ఈ సంప్ర‌దాయానికి తెర‌ప‌డుతుందో లేదో చూడాలి.