ప్రాణాలకంటే ఆదాయమే ముఖ్యమా : మద్యం షాపులు ఓపెన్..మరి తెలంగాణలో

  • Published By: madhu ,Published On : May 4, 2020 / 03:20 AM IST
ప్రాణాలకంటే ఆదాయమే ముఖ్యమా : మద్యం షాపులు ఓపెన్..మరి తెలంగాణలో

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం లాక్ డౌన్ 3.0 కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. అందులో ప్రధానమైంది మద్యం విక్రయాలు (సామాజిక దూరం, సమయంలో మార్పు). ఇదే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మొదటి నుంచి లిక్కర్ షాపులు తెరవడానికి నో చెబుతున్న తెలంగాణ రాష్ట్రంపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే పొరుగున్న రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర) ప్రభుత్వాలు మద్యం విక్రయాలకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. మరో విషయం ఏమిటంటే 2020, మే 07వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. 

మద్యం దుకాణాలు మూసివేతకు తెలంగాణ కట్టుబడి ఉంటే..పొరుగు రాష్ట్రాల్లో తెరవడంపై హాట్ టాపిక్ అయ్యింది. దీనిద్వారా..కొన్ని పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం స్మగ్లింగ్ కు దారి తీసే ప్రమాదం ఉంది. ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా..లిక్కర్ షాపులు తెరవడానికి నో చెప్పారు సీఎం కేసీఆర్. దీనివల్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోతుందని తెలిసినా..ప్రజల ప్రాణమే ముఖ్యమని భావించారు. గత 42 రోజుల లాక్ డౌన్ వల్ల సుమారు రూ. 3 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని అంచనా. పక్కనున్న రాష్ట్రాలు మాత్రం ఆదాయమే ముఖ్యమని భావించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

లాక్ డౌన్ పొడిగింపు…ఇతర రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు స్టార్ట్ చేయడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా స్టడీ చేస్తోంది. అక్రమమార్గంలో మద్యం రాష్ట్రంలోకి ప్రవేశించే ఛాన్స్ ఉందని, బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంది. ఇక్కడ కల్తీ మద్యం కూడా ప్రవేశిస్తే…ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.  

Also Read | తెలంగాణలో మే 21 వరకు లాక్ డౌన్ కొనసాగింపు ?