Ind Vs Aus Womens T20 World Cup : వరల్డ్‌కప్‌లో ముగిసిన భారత్ పోరాటం, ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. టీమిండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఫైనల్ కు చేరుకుంది. 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

Ind Vs Aus Womens T20 World Cup : వరల్డ్‌కప్‌లో ముగిసిన భారత్ పోరాటం, ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

Ind Vs Aus Womens T20 World Cup : ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. భారత్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఫైనల్ కు చేరుకుంది. 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఓపెనర్లు షఫాలీ శర్మ(9), స్మృతీ మందాన(2), యస్తికా భాటియా(4) విఫలమైనా జెమీమా రోడ్రిగ్స్ 43(24 బంతుల్లో), హర్మన్ ప్రీత్ 52(34 బంతుల్లో) ఆదుకున్నారు. అయితే చివరలో హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఓ దశలో గెలుస్తుందనుకున్న భారత్ ఓటమి పాలైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది.

Also Read..IPL 2023..Jio Cinemas OTT : ఓటీటీపై అంబానీ కన్ను..జియో సినిమా యాప్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు, సబ్‌స్క్రిప్షన్‌ లేకున్నా ఫ్రీగా చూడొచ్చు..

కాగా ఈ మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతంగా ఆడింది. హాఫ్ సెంచరీతో చెలరేగింది. 34 బంతుల్లోనే 52 పరుగులు చేసింది. 6 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టింది. హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడుగా ఆడి భారత్ ను విజయానికి చేరువ చేసింది. మరికాసేపు ఆమె క్రీజులో ఉండి ఉంటే గెలుపు మనదే అని అంతా అనుకున్నారు. భారత్ విజయానికి 32 బంతుల్లో 39 రన్స్ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆమె రనౌట్ అయ్యింది. అంతే, మ్యాచ్ ములుపు తిరిగింది. భారత్ ఓటమి పాలైంది.(Ind Vs Aus Womens T20 World Cup)

కేప్ టౌన్ జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెత్ మూనీ 54, కెప్టెన్ మెగ్ లానింగ్ 49 (నాటౌట్), ఆష్లే గార్డనర్ 31, అలీసా హీలా 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శిఖా పాండే 2 వికెట్లు తీసింది. దీప్తి శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు.

Also Read..Anderson-Test rankings: జేమ్స్ ఆండర్సన్.. వయసు 40.. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం

173 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందాన 2, యువ బ్యాటర్ షెఫాలీ వర్మ 9 పరుగులకే వెనుదిరిగారు. వన్ డౌన్ లో వచ్చిన యస్తికా భాటియా 4 పరుగులు చేసి రనౌట్ అయింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ జట్టును ఆదుకున్నారు. కానీ, జట్టుని గెలిపించలేకపోయారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఎంతో అద్భుతంగా బ్యాటింది. ఒంటి చేత్తో జట్టుని విజయం దిశగా నడిపించింది. అయితే, 52 పరుగుల వద్ద హర్మన్ సింపుల్ గా సింగిల్ తీస్తూ క్రీజులో బ్యాట్ పెట్టబోయింది. కానీ, బ్యాట్.. కింద మట్టిలో తట్టుకోవడంతో ముందుకు వెళ్లలేదు. ఈలోగా ఆసీస్ కీపర్ రనౌట్ చేసి అప్పీల్ కోరింది. రీప్లేలో హర్మన్ ఔట్ అయినట్లు తేలింది. అంతే, యావత్ భారత అభిమానుల హార్ట్ బ్రేక్ అయ్యింది. ఆ తర్వాత భారత్ ఓటమిపాలైంది.