Anderson-Test rankings: జేమ్స్ ఆండర్సన్.. వయసు 40.. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం

జేమ్స్ ఆండర్సన్.. వయసు 40 సంవత్సరాల 207 రోజులు.. ఇంగ్లండ్ బౌలర్. ఈ వయసులోనూ క్రికెట్ ఆడుతున్నాడు. కేవలం ఆడడమే కాదు.. ఈ వయసులో ప్రపంచ యువ బౌలర్లకు సవాలు విసురుతూ ఐసీసీ ర్యాకింగ్స్ లో దూసుకుపోతున్నాడు. తాజాగా, ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్ 45 ఏళ్ల వయసులో 1936లో టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉండేవారు.

Anderson-Test rankings: జేమ్స్ ఆండర్సన్.. వయసు 40.. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం

Anderson-Test rankings

Anderson-Test rankings: జేమ్స్ ఆండర్సన్.. వయసు 40 సంవత్సరాల 207 రోజులు.. ఇంగ్లండ్ బౌలర్. ఈ వయసులోనూ క్రికెట్ ఆడుతున్నాడు. కేవలం ఆడడమే కాదు.. ఈ వయసులో ప్రపంచ యువ బౌలర్లకు సవాలు విసురుతూ ఐసీసీ ర్యాకింగ్స్ లో దూసుకుపోతున్నాడు. తాజాగా, ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు.

ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్ 45 ఏళ్ల వయసులో 1936లో టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 40 ఏళ్ల వయసు ఉన్న, అత్యధిక వయసు ఉన్న ఏ బౌలర్ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలవలేదు. మళ్లీ 87 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ ఘనత జేమ్స్ ఆండర్సన్ కు దక్కింది.

నిన్నటి వరకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అతడిని వెనుకేసి ఆ స్థానంలో ఇప్పుడు జేమ్స్ ఆండర్సన్ (866 రేటింగ్స్) నిలిచాడు. ప్యాట్ కమ్మిన్స్ రెండు స్థానాలు కోల్పోయి ప్రస్తుతం 858 రేటింగ్స్ తో మూడో స్థానానికి దిగజారాడు. ఇక భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 864 రేటింగ్స్ తో రెండో స్థానానికి ఎగబాకాడు.

న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య ఈ నెల 16-19 మధ్య మొదటి టెస్టు మ్యాచు జరిగింది. మొదటి ఇన్నింగ్స్ లో జేమ్స్ ఆండర్సన్ మూడు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. న్యూజిలాండ్ పై తమ జట్టు 267 పరుగులతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

జేమ్స్ ఆండర్సన్ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలవడం ఇది ఆరో సారి. అతడు 2003 మే 22న జింబాబ్వేతో జరిగిన మ్యాచుతో టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు 178 టెస్టు మ్యాచులు ఆడి 682 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముత్తయ్య మురళీ ధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708) తర్వాత జేమ్స్ ఆండర్సన్ (682) ఉన్నాడు.

Sania Mirza: టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా .. చివరి టోర్నీలో ఓటమి.. సానియా ట్రాక్‌ రికార్డ్‌ ఇలా..