Ind Vs SA : మూడో రోజు ముగిసిన ఆట.. గెలుపు దిశగా సౌతాఫ్రికా
240 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 118 పరుగులు చేసింది. కేవలం రెండు వికెట్లే కోల్పోయింది. ఇంకా రెండు రోజుల ఆట ఉండటం..

Ind Vs Sa 2nd Test
Ind Vs SA : జోహన్నెస్ బర్గ్ వేదికగా భారత్ తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా గెలుపు దిశగా సాగుతోంది. 240 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 118 పరుగులు చేసింది. కేవలం రెండు వికెట్లే కోల్పోయింది. క్రీజులో డీన్ ఎల్గర్ (46*), డస్సెన్ (11*) ఉన్నారు. ఇంకా 122 పరుగులు చేస్తే సౌతాఫ్రికా విజయం సాధిస్తుంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ మార్‌క్రమ్ 31, పీటర్సెన్ 28 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్దూల్, అశ్విన్ చెరో వికెట్ తీశారు. ఇంకా రెండు రోజుల ఆట ఉండటం.. ఆతిథ్య జట్టు చేతిలో 8 వికెట్లు ఉండటంతో గెలుపు అవకాశాలు వారికే ఎక్కువగా ఉన్నాయి.
భారత తన రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు రాణించడంతో దక్షిణాఫ్రికా ముందు మంచి లక్ష్యాన్నే ఉంది. ఫామ్‌తో ఇబ్బంది పడిన మిడిలార్డర్ బ్యాటర్లు అజింక్య రహానె (58), ఛెతేశ్వర్ పుజారా (53) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఇక హనుమ విహారి (40*), శార్దూల్ ఠాకూర్ (28) కూడా రాణించడంతో భారత్ 266 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, ఎంగిడి, జాన్‌సెన్ చెరో మూడు వికెట్లు తీశారు. అలివీర్ ఒక వికెట్ తీశాడు.
Bharat Biotech : భారత్ బయోటెక్ కీలక ప్రకటన..వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయొద్దు!
స్కోరు వివరాలు..
ఫస్ట్ ఇన్నింగ్స్ : భారత్ 202 ఆలౌట్.. దక్షిణాఫ్రికా 229 ఆలౌట్
సెకండ్ ఇన్నింగ్స్ : భారత్ 266 ఆలౌట్ .. దక్షిణాఫ్రికా 118/2 (40 ఓవర్లు)