Made In India F-INSAS..Nipun : ఇండియన్ ఆర్మీకి రక్షణ శాఖ అందించిన అత్యాధునిక ఆయుధాల ప్రత్యేకత..ఉపయోగాలు..

ఐపీఎంవీ, ఎఫ్-ఇన్సాస్, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్, ఆర్.పాస్, ల్యాండిగ్ క్రాఫ్ట్ అసాల్ట్ బోట్స్.. ఇలాంటి ఎన్నో అత్యాధునిక ఆయుధాలను.. మన సైన్యం చేతికి అందించింది రక్షణ శాఖ. ఇంతకీ.. ఈ కొత్త జనరేషన్ వెపన్స్ ఎలా పనిచేస్తాయ్? లద్దాఖ్ సరిహద్దుల్లో.. సైన్యానికి ఎలా ఉపయోగపడబోతున్నాయ్? వీటితో.. డ్రాగన్ ఆర్మీకి ఎలా చెక్ పెట్టొచ్చు..?

Made In India F-INSAS..Nipun : ఇండియన్ ఆర్మీకి రక్షణ శాఖ అందించిన అత్యాధునిక ఆయుధాల ప్రత్యేకత..ఉపయోగాలు..

India Army Weapons Made In India F-INSAS..Nipun 

India Army Weapons Made In India F-INSAS..Nipun  : ఐపీఎంవీ, ఎఫ్-ఇన్సాస్, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్, ఆర్.పాస్, ల్యాండిగ్ క్రాఫ్ట్ అసాల్ట్ బోట్స్.. ఇలాంటి ఎన్నో అత్యాధునిక ఆయుధాలను.. మన సైన్యం చేతికి అందించింది రక్షణ శాఖ. ఇంతకీ.. ఈ కొత్త జనరేషన్ వెపన్స్ ఎలా పనిచేస్తాయ్? లద్దాఖ్ సరిహద్దుల్లో.. సైన్యానికి ఎలా ఉపయోగపడబోతున్నాయ్? వీటితో.. డ్రాగన్ ఆర్మీకి నిజంగానే చెక్ పెట్టొచ్చా?

ఇండియన్ ఆర్మీ అమ్ములపొదిలో చేరిన సరికొత్త ఆయుధాలన్నీ.. మన సైన్యానికి బిగ్ బూస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా.. చైనా సరిహద్దుల్లో ఇవి మన బలగాల శక్తి, సామర్థ్యాలను ఎంతగానో మెరుగుపరచనున్నాయి. పాంగాంగ్ లేక్‌లో.. భారత సైన్యం సరికొత్త అసాల్ట్ వెసెల్‌ను మోహరించింది. అలాగే.. ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ బోట్స్.. ఎల్ఏసీ వెంబడి సైన్యం కార్యకలాపాలను మరింత మెరుగుపరచనున్నాయి. ఈ పడవలు.. 35 కాంబాట్ ట్రూప్స్‌ని ఒకేసారి తీసుకెళ్లగలవు. అంతేకాదు.. పాంగాంగ్ సరస్సులో.. ఏ ప్రాంతానికైనా.. చాలా తక్కువ సమయంలోనే చేరుకోగలవు. పాంగాంగ్‌‌లో.. పెట్రోలింగ్‌ కోసం ఈ కొత్త బోట్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ బోట్స్‌ని.. గోవాకు చెందిన ఆక్వారియస్‌ షిప్‌ యార్డ్‌ లిమిటెడ్‌ తయారుచేసింది.

ఫ్యూచర్‌ ఇన్‌ఫాంట్రీ సోల్జర్‌ యాజ్‌ ఏ సిస్టమ్‌.. ఎఫ్ ఇన్సాస్ పేరుతో.. సరికొత్త టెక్నాలజీని సైన్యానికి అందజేశారు. ఇందులో.. ముఖ్యంగా 3 వ్యవస్థలు పనిచేస్తాయి. మొదటిది.. పగలు, రాత్రి హోలోగ్రాఫిక్, రిప్లెక్స్ దృశ్యాలతో పాటు అత్యాధునిక 203 అసాల్ట్ రైఫిల్ ఉంటుంది. అవసరాన్ని బట్టి.. థర్మల్ ఇమేజర్ దృశ్యాలు ఉపయోగిస్తారు. ఇక.. వెపన్‌తో పాటు హెల్మెట్ మీద కూడా ఓ సైట్‌ని ఫిక్స్ చేశారు. ఆపరేషనల్ కండీషన్స్‌లో.. 360 డిగ్రీలలో.. చూసేందుకు వీలుగా.. దీనిని తయారుచేశారు. వీటితో పాటు ఇందులో.. మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్‌కు సంబంధించిన కిట్, ఓ కత్తి కూడా ఉంటుంది. ఇక.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌తో పాటు ప్రత్యేకంగా తయారుచేసిన హెల్మెట్, ప్రొటెక్టివ్ షూస్ కూడా సైనికులకు అందజేశారు. ఈ సూట్‌లోనే.. గ్రెనేడ్స్, బుల్లెట్ మ్యాగజిన్స్, రేడియో సెట్స్‌తో పాటు ఆపరేషనల్ ఎక్విప్‌మెంట్ అంతా ఉంటుంది. ఇక.. ఇందులోనే.. కమ్యూనికేషన్ అండ్ సర్వీలియెన్స్ సిస్టమ్ కూడా అమర్చారు. ప్రతి సైనికుడు చేతితో వాడే అవసరం లేకుండానే రేడియో సెట్ అమర్చబడి ఉంటుంది. దీంతో.. వాళ్ల కమాండర్‌తో.. కమ్యూనికేట్ చేసేందుకు ఈజీగా ఉంటుంది.

Also read : Made In India F-INSAS..Nipun : చైనాకు చెక్ పెట్టటానికి లద్దాఖ్ సరిహద్దుల్లో భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు

ఇక.. సరిహద్దుల్లో తక్కువ రక్షణతో పాటు లిమిటెడ్ మొబిలిటీ ఉన్న సైనికులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్లందరి కోసం.. టాటా కంపెనీ తయారుచేసిన ఇన్‌ఫాంట్రీ ప్రొటెక్టెడ్ మొబిలిటీ వెహికిల్ కూడా సైన్యానికి అందజేశారు. దీనిని.. సాయుధ బలగాల క్యారియర్‌గా చెప్పొచ్చు. ఇది.. సైన్యానికి రక్షణ అందించడమే కాదు.. దళాలను త్వరితగతిన.. ఒకచోటు నుంచి మరో చోటుకు చేర్చడానికి కూడా ఉపయోగపడుతుంది.

దీనితో పాటు.. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో.. క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్‌ని కూడా తీసుకొచ్చారు. ఇవి కూడా బలగాలను వెంటనే తరలించేందుకు ఉపయోగపడతాయి. చాలా వేగంగా సైన్యం రియాక్ట్ అయ్యేందుకు దోహదపడతాయి. ఇందులో ఫైర్ పవర్ తో పాటు అధిక రక్షణ ఉంటుంది. ఇక.. ఎల్ఏసీ వెంబడి ఉన్న ఫార్వార్డ్ ప్రాంతాల్లో.. శత్రువుల కదలికలపై దృష్టి పెట్టేందుకు వీలుగా తయారుచేసిన డ్రోన్ సిస్టమ్‌ని కూడా ఆర్మీకి అందించారు.

వీటితో పాటు న్యూ జనరేషన్ యాంటీ పర్సనల్‌ మైన్‌.. నిపున్‌, ఆటోమేటిక్‌ కమ్యూనికేషన్ సిస్టమ్‌, ట్యాంకులకు అమర్చిన లేటెస్ట్ సైట్‌ సిస్టమ్‌, అడ్వాన్స్‌డ్‌ థర్మల్‌ ఇమేజర్స్‌‌ని కూడా అందజేశారు. ఈ ఆయుధాలు, వార్ ఫేర్ సిస్టమ్‌ని.. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద.. డీఆర్డీవో, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ సహకారంతో.. ఇండియన్ ఆర్మీ అభివృద్ధి చేసింది. మేడిన్ ఇండియా వెపన్స్, సిస్టమ్స్‌తో.. చైనా సరిహద్దుల్లోనే భారత సైన్యం ఫుల్ జోష్‌లో ఉంది.

ఇదిలా ఉంటే.. తూర్పు లద్దాఖ్‌లో మిగిలిన సమస్యలపై.. పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని.. త్వరగా రూపొందించాలని.. భారత్,- చైనా 16వ రౌండ్ అత్యున్నత స్థాయి చర్చల్లో అంగీకరించాయి. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు.. ఎల్ఏసీ వెంబడి శాంతి, ప్రశాంతతను పునరుద్ధరించడానికి.. ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సాధించడంలో సహాయపడుతుందని రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి.