Made In India F-INSAS..Nipun : చైనాకు చెక్ పెట్టటానికి లద్దాఖ్ సరిహద్దుల్లో భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు

దేశ సరిహద్దుల్లో చైనా ఆగడాలకు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేలా.. అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంది ఇండియన్ ఆర్మీ. భారత రక్షణ రంగాన్ని.. మరింత బలోపేతం చేసేలా.. సైన్యం అమ్ములపొదిలో మరిన్ని అత్యాధునిక ఆయుధాలు చేరాయి. పూర్తి.. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ వెపన్స్, టెక్నికల్ సిస్టమ్స్‌.. సరిహద్దుల్లో మన జవాన్లకు మరింత బలమివ్వనున్నాయి.

Made In India F-INSAS..Nipun : చైనాకు చెక్ పెట్టటానికి లద్దాఖ్ సరిహద్దుల్లో భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు

IND ARMY WEAPONS F-INSAS .. Nipun .. LCA

IND ARMY WEAPONS F-INSAS .. Nipun .. LCA : దేశ సరిహద్దుల్లో చైనా ఆగడాలకు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేలా.. అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంది ఇండియన్ ఆర్మీ. భారత రక్షణ రంగాన్ని.. మరింత బలోపేతం చేసేలా.. సైన్యం అమ్ములపొదిలో మరిన్ని అత్యాధునిక ఆయుధాలు చేరాయి. పూర్తి.. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ వెపన్స్, టెక్నికల్ సిస్టమ్స్‌.. సరిహద్దుల్లో మన జవాన్లకు మరింత బలమివ్వనున్నాయి.

దేశ సరిహద్దుల్లో.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి.. కవ్వింపులకు దిగుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు.. ఇండియా సిద్ధమైంది. లద్దాఖ్‌లోని.. పాంగాంగ్ సరస్సు దగ్గర.. అధునాతన ఆయుధాలను మోహరించింది భారత్. పాంగాంగ్‌ సరస్సులో.. ఆర్మీ బోట్‌ నిరంతరం పహారా కాస్తోంది. డ్రాగన్‌ ఆర్మీ కదలికలపై భారత సైన్యం నిఘా కూడా కొనసాగుతోంది. తాజాగా.. అధునాతన ఆయుధాలను ఇండియన్ ఆర్మీకి అందించింది రక్షణశాఖ. ఎల్ఏసీ దగ్గర.. చైనా కదలికలపై డ్రోన్లతో నిఘా పెట్టారు. డ్రాగన్ ఆక్రమణలను అడ్డుకునేందుకు.. రక్షణ శాఖ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.

లద్దాఖ్‌లో తరచుగా ఆక్రమణలకు పాల్పడుతున్న చైనా చర్యలను తిప్పికొట్టేందుకు భారత సైన్యం రెడీ అయింది. ఓ వైపు.. చర్చలు జరుపుతూనే.. చైనా బలగాలు లద్దాఖ్‌తో పాటు అరుణాచల్‌లోనూ దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో.. డ్రాగన్ వ్యూహాలను తిప్పికొట్టేందుకు.. భారత రక్షణ శాఖ.. ఆర్మీకి అత్యాధునిక ఆయుధాలను అందించింది. స్వదేశీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు అత్యాధునిక డ్రోన్లను సైన్యానికి అందజేశారు. ఈ ఆయుధాల్లో.. యాంటీ పర్సనల్ ల్యాండ్‌మైన్.. నిపున్, ల్యాండింగ్ అటాక్ క్రాఫ్ట్‌తో పాటు అనేక ఇతర వెపన్ సిస్టమ్స్ ఉన్నాయి.

సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే.. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. యుద్ధ విమానాలను భారత సరిహద్దులకు పంపుతూ.. రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. చైనా కవ్వింపులకు.. భారత్‌ కూడా దీటుగా బదులిస్తోంది. తాజాగా ఈ కొత్త ఆయుధాలతో.. డ్రాగన్‌ ఆటలకు కళ్లెం వేసేందుకు భారత సైన్యానికి అదనపు బలం చేకూరినట్లయింది. ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టిన భారత్.. స్వదేశీ పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తోంది. మేకిన్ ఇండియాలో భాగంగా.. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో.. ఆయుధాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. డీఆర్డీఓతో కలిసి రూపొందించిన అధునాతన ఆయుధాలనే.. ఇప్పుడు సైన్యానికి అప్పగించారు. ఇందులో.. ఇన్సాస్, నిపుణ్ లాంటి కొత్త జనరేషన్ ఆయుధాలతో పాటు ఆధునిక టెక్నాలజీతో కూడిన బోట్లను కూడా అప్పగించారు.

Also read : Made In India F-INSAS..Nipun : ఇండియన్ ఆర్మీకి రక్షణ శాఖ అందించిన అత్యాధునిక ఆయుధాల ప్రత్యేకత..ఉపయోగాలు..

అధునాతన ఆయుధాలతో భారత సైన్యం శక్తి, సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు.. సైన్యం సంసిద్ధంగా ఉండేలా.. ఈ కొత్త పెపన్స్ ఉపయోగపడనున్నాయి. కొన్ని ఆయుధాలను ఆర్మీ అధికారులకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ నేరుగా అందజేయగా.. బోట్లు, డ్రోన్‌ వ్యవస్థలను వర్చువల్‌గా అప్పగించారు. ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్, అధునాతన నిఘా వ్యవస్థలు, ఇతర పరికరాలను కలిగి ఉండే కొత్త బోట్లను పాంగాంగ్ సరస్సు వద్ద పర్యవేక్షణకు మోహరించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈస్ట్ లద్దాఖ్ విషయంలో చైనాతో జరిపిన చర్చల్లో.. ప్రతిష్టంభన నెలకొంది. కొద్ది రోజులుగా.. ఎల్ఏసీలో చైనా కాలు దువ్వుతోంది. ఈ మధ్యకాలంలోనే.. డ్రోన్లను కూడా ప్రయోగించినట్లు.. ఇండియన్ ఆర్మీ అనుమానిస్తోంది. ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు దగ్గర డ్రాగన్ ఆర్మీ తోక జాడిస్తోంది. ఇప్పుడు.. మేడిన్ ఇండియా టెక్నాలజీతో పాటు అధునాతన వెపన్స్, వెహికిల్స్ ఆర్మీ చేతిలో ఉన్నాయి. లేటెస్ట్ వార్ ఫేర్ సిస్టమ్‌తో.. చైనాకు దీటుగా సమాధానం చెప్పేందుకు భారత్ సిద్ధమైంది.