India Vs Sri lanka : తొలి టీ20లో శ్రీలంకపై భారత్ విజయం

టీ 20 సిరీస్ లో భారత్ తొలి ప్రారంభంలోనే అదరగొట్టింది. శ్రీలంక జట్టుపై 38 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో చెలరేగడం, కెప్టెన్ శిఖర్ ధావన్ రాణించడంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేధించలేక శ్రీలంక జట్టు 18.3 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

India Vs Sri lanka : తొలి టీ20లో శ్రీలంకపై భారత్ విజయం

India

India Beat Sri lanka : టీ 20 సిరీస్ లో భారత్ తొలి ప్రారంభంలోనే అదరగొట్టింది. శ్రీలంక జట్టుపై 38 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో చెలరేగడం, కెప్టెన్ శిఖర్ ధావన్ రాణించడంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేధించలేక శ్రీలంక జట్టు 18.3 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ కు విజయాన్నందించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది భారత్ జట్టు.

Read More : Actress Vanitha Vijaykumar : నాలుగు కాకపోతే 40 పెళ్లిళ్లు చేసుకుంటా….!

తొలి బంతికే ఓపెనర్ పృథ్వీ షా (0) వికెట్ కోల్పోయింది. ఫస్ట్ డౌన్ లో వచ్చిన సంజూ సామ్సన్ (20 బంతుల్లో 27) కొద్దిగా రాణించాడు. దీంతో భారత జట్టు 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. కానీ తర్వాతి ఓవర్లలో సంజూ వెనుదిరిగాడు. సూపర్ ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ బ్యాట్ ఝులిపించాడు. హాఫ్ సెంచరీతో చెలరేగిన ఇతను..ధావన్ తో కలిసి మూడో వికెట్ కు 62 పరుగులు జోడించాడు. అనంతరం ధావన్ (46) 15వ ఓవర్లలో అవుట్ అయ్యాడు. సూర్య (50) తర్వాతి ఓవర్ లో వెనుదిరిగాడు. హర్దిక్ (10), కిషన్ (20 నాటౌట్)గా ఉన్నారు. చివరి 4 ఓవర్లలో 34 పరుగులు మాత్రమే వచ్చాయి. మొత్తంగా 20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 164 పరుగులు చేయగలిగింది.

Read More :Fatima Sana: ఫాతిమా హాట్ పిక్స్.. అమిర్ కూతురు లైక్స్!

అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు ఆచూతూచి ఆడింది. అసలంక (44) రాణించడంతో భారత్ విజయం సాధిస్తుందా అనే డౌట్స్ వచ్చాయి. ఫోర్లు, సిక్స్ లతో ఇతను చెలరేగిపోయాడు. ఇతగాడి జోరుతో లంక జట్టు 15.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేయగలిగింది. 16వ ఓవర్లలో అసలంకను దీపక్ చౌహార్ అవుట్ చేయడంతో..మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన బౌలర్లు..టెయిలెండర్లను చకచకా వెనక్కి పంపింది. శ్రీలంక జట్టు 15 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. 18.3 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. రెండో టి20 మంగళవారం జరుగుతుంది.

Read More :Nalgonda District : వివాహిత మహిళ ఆత్మహత్య

భారత్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) మినోద్‌ (బి) చమీర 0; ధావన్‌ (సి) బండార (బి) కరుణరత్నే 46; సామ్సన్‌ (ఎల్బీ) (బి) హసరంగ 27; సూర్యకుమార్‌ (సి) (సబ్‌) మెండిస్‌ (బి) హసరంగ 50; హార్దిక్‌ (సి) మినోద్‌ (బి) చమీర 10; ఇషాన్‌ (నాటౌట్‌) 20; కృనాల్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164.

Read More :INDvSL: గోల్డెన్ డక్‌గా పృథ్వీ.. ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్

శ్రీలంక ఇన్నింగ్స్‌: అవిష్క (సి) సామ్సన్‌ (బి) భువనేశ్వర్‌ 26; మినోద్‌ (సి) సూర్యకుమార్‌ (బి) కృనాల్‌ 10; ధనంజయ డిసిల్వా (బి) చహల్‌ 9; అసలంక (సి) పృథ్వీ (బి) దీపక్‌ 44; బండార (బి) హార్దిక్‌ 9; షనక (స్టంప్డ్‌) ఇషాన్‌ (బి) వరుణ్‌ 16; హసరంగ (బి) దీపక్‌ 0; కరుణరత్నే (బి) భువనేశ్వర్‌ 3; ఉదాన (సి) సూర్యకుమార్‌ (బి) భువనేశ్వర్‌ 1; చమీర (సి) కృనాల్‌ (బి) భువనేశ్వర్‌ 1; అకిల (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.3 ఓవర్లలో) 126 ఆలౌట్‌.