ఆ 19 దేశాల నుంచి స్వదేశానికి భారతీయులు

  • Published By: Subhan ,Published On : May 9, 2020 / 08:44 AM IST
ఆ 19 దేశాల నుంచి స్వదేశానికి భారతీయులు

Russia, Germany, Thailand, France, Spain, Uzbekistan and Kazakhstan దేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నారు. మే15 నుంచి  కార్యాచరణ మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 64 ఎయిరిండియా విమానాలను మే నుంచి మే 13వరకూ 12దేశాల్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చే పనిలో ఉంది. 

US, United Arab Emirates, UK, Bangladesh, Bahrain, Kuwait, Singapore, Malaysia, Philippines, Oman, Qatar, Saudi Arabia దేశాల్లో ఉన్న 15వేల మంది ఇండియన్లను తీసుకొచ్చిన తర్వాత మిగిలిన దేశాల వారిని తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. 

UAEకు 10విమానాలు, USకు, UKకు ఏడేసి విమానాలు, Saudi Arabiaకు 5విమానాలు, Singaporeకు 5విమానాలు, Qatarకు 2విమానాలు పంపనుంది. ఇదే సమయంలో మలేసియ, బంగ్లాదేశ్ కు ఏడు విమానాలు, కువైట్, ఫిలిప్పీన్స్ కు చెరో 5విమానాలు, ఒమన్, బహ్రైన్ కు చెరో 2విమానాలు పంపే ప్లాన్ లో ఉన్నారు. 

స్వదేశీయులతో తొలి విమానం సింగపూర్ నుంచి న్యూ ఢిల్లీలో దిగే సమయానికి గల్ఫ్ లోని ప్రాంతాల నుంచి 4విమానాలు దక్షిణ భారతదేశంలో ల్యాండ్ అవుతాయి. ప్రయాణికులకు ఇండియాలోకి రాగానే స్క్రీనింగ్ నిర్వహిస్తారు. కేరళలో వారిని బస్సుల్లో సొంత జిల్లాలకు తీసుకెళ్తారు. గర్భిణీలకు, వృద్ధులకు ఇళ్లకు పంపి అక్కడే క్వారంటైన్ లో ఉండేలా చూస్తారు. 

Read More:

కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతోందా ? ICMR ఫోకస్..ర్యాండమ్ పరీక్షలు