కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతోందా ? ICMR ఫోకస్..ర్యాండమ్ పరీక్షలు

  • Published By: madhu ,Published On : May 9, 2020 / 06:45 AM IST
కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతోందా ? ICMR ఫోకస్..ర్యాండమ్ పరీక్షలు

దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వైరస్‌ వ్యాప్తి ఎలా జరుగుతోందన్న దానిపై ఐసీఎంఆర్‌  దృష్టి సారించింది. వైరస్‌ కమ్యూనిటీ స్ప్రెడ్‌ అవుతోందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. కమ్యూనిటీ స్ప్రెడ్‌పై స్టడీ చేయడానికి సిద్ధమైంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ర్యాండమ్‌ పరీక్షలు చేయాలని నిర్ణయించింది.  ర్యాండమ్‌ టెస్ట్‌ల కోసం  75 జిల్లాలను ఎంపిక చేసుకుంది. ఈ ఎంపిక జిల్లాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్‌ జరుగుతుందా.. లేదా అన్నదానిపైనే ప్రధానంగా ఫోకస్‌ చేయనుంది. కరోనా లక్షణాలు ఉన్నవారు.. అసలు లేనివారు… స్వల్ప లక్షణాలు కలిగిన వ్యక్తులకు ఐసీఎంఆర్‌ టెస్ట్‌లు నిర్వహించనుంది.

ఐసీఎంఆర్‌ ఎంపిక చేసుకున్న 75 జిల్లాలు రెడ్‌ జోన్‌కు సంబందించినవే కాదు. ఇందులో రెడ్, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ అధ్యయనంలో భాగంగా… వైరస్‌పై పోరాడేలా ప్రజల్లో  యాంటీ బాడీస్‌ డెవలప్‌ అవుతున్నాయా లేదా అన్నది తెలుస్తోంది. అంతేకాదు.. ఎవరెవరికి కరోనా లక్షణాలు ఉన్నయో కూడా తెలిసిపోతుంది. వ్యాధి నిరోధకశక్తి ఎక్కువ ఉన్నవారికి కరోనా సోకినా వారిలో లక్షణాలు కనిపించవు. 

దేశ వ్యాప్తంగా నమోదైన  బాధితుల్లో ఇలాంటివారే ఎక్కువ మంది ఉన్నారు. వీరితో వైరస్‌ వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ముంది. మరో  20శాతం బాధితుల్లోనే స్పష్టమైన లక్షణాలు కనిపించినట్టు నిపుణులు  చెబుతున్నారు. అందుకే వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉండి కరోనా లక్షణాలు బయపటపడని వారిని ….ఈ ర్యాండమ్‌ టెస్ట్‌లు నిర్వహించడం ద్వారా గుర్తించడానికి అవకాశం ఏర్పడుంతది. కమ్యూనిటి స్ప్రెడ్‌ ఏ స్థాయిలో ఉందో కూడా  తెలుసుకోవచ్చని ఐసీఎంఆర్‌ శాస్ర్తవేతలు చెబుతున్నారు.

ర్యాండమ్‌ టెస్ట్‌లకు.. ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రదేశాలను ఎంచుకున్నారు. ఒక జిల్లాలో ఎక్కువ జనాభా ఎక్కడ నివసిస్తారో తెలుసుకుని అక్కడ పరీక్షలు చేస్తారు.  ఎక్కువ మంది రాకపోకలు సాగించే  రాష్ట్రాల సరిహద్దు దగ్గర కూడా టెస్ట్‌లు నిర్వహిస్తారు. ర్యాండమ్‌ శాంపిల్స్‌ సేకరణకు సంబంధించిన సర్వేను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఐసీఎంఆర్‌ తెలిపింది.  ఇందుకోసం నిపుణులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చైనాకు చెందిన యాంటీ బాడీస్‌ రాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లతో పరీక్షలు నిర్వహించాలని నిపుణులు భావించారు. అయితే అవి కచ్చితమైన రిజల్ట్స్‌ ఇవ్వకపోవడంతో కొన్ని రోజులు వాయిదా వేశారు.  ఎలీసా కిట్లతో ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. 

అయితే ఎలీసా కిట్లు సరిపడినట్టు లేకపోవడంతో వాటికోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఒక ప్రాంతంలో ఎన్ని శాంపిల్స్‌ సేకరించాలన్న దానిపై నిపుణులు ఇంకా ఓ నిర్ణయానికి కూడా రాలేదు. మొత్తానికి త్వరలోనే కమ్యూనిటీ స్ప్రెడ్‌ జరుగుతుందా అన్నదానిపై ఐసీఎంఆర్‌ తేల్చనుంది.