Corona Cases : దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 2,550 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,25,87,259 మంది కోలుకున్నారు.

Corona Cases : దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

COVID 19

Corona Cases : దేశంలో కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1829 కొత్త కేసులు, 33 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 15,647 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,31,27,199 కేసులు, 5,24,293 మరణాలు నమోదు అయ్యాయి.

దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 2,550 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,25,87,259 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు 84.49 కోట్లు దాటింది. గడిచిన 24 గంటల్లో 4,34,962 టెస్టులు నిర్వహించారు.

Covid Deaths: భారత్‌లోనే కరోనా మరణాలు ఎక్కువన్న డబ్ల్యూ.హెచ్.ఓ: కొట్టిపారేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84,49,26,602 కరోనా టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3372 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 1433 ప్రభుత్వ లాబ్స్,1939 ప్రైవేట్ లాబ్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది.

మరోవైపు భారత్ లో 487 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 191.65 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. నిన్న 14,97,695 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 191,65,00,770 డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.