Corona Alert : థర్డ్ వేవ్ పంజా.. నిన్న 3లక్షలకు పైగా కేసులు నమోదు

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9వేల 287 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది.

Corona Alert : థర్డ్ వేవ్ పంజా.. నిన్న 3లక్షలకు పైగా కేసులు నమోదు

Corona Cases India

Corona Alert : దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పండుగ సీజన్ తర్వాత మొదటిసారిగా భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపించినప్పటికీ.. జనవరి 19, 2022 నాడు భారీగా పెరిగాయి.

Read This : Fever Survey : తెలంగాణలో మరోసారి జ్వర సర్వే

థర్డ్ వేవ్ మొదలైనప్పటినుంచి మొదటిసారి దేశంలో రోజు వారీ పాజిటివ్ కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. దేశంలో 24గంటల్లో 3,17,532 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 491 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ లో తెలిపింది.

ఇండియాలో జనవరి 19 నాటికి 19,24,051 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 5.03గా ఉందని కేంద్రం తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతానికి చేరింది. దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 82 లక్షల 18వేల 773 కేసులు నమోదయ్యాయి. 4లక్షల 87వేల 693 కరోనా మరణాలు సంభవించాయి.

దేశంలో ప్రస్తుతం 93.69 శాతంగా కరోన రికవరీ రేటు ఉన్నట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 2,23,990 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 3కోట్ల 58లక్షల 7వేల 29 మంది రికవరీ అయ్యారు.

Read This : Virat Kohli: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9వేల 287 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది.