Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్

జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు జీవిత ఖైదు విధించడం పట్ల ఓఐసీ-ఐపీహెచ్‌ఆర్సీ చేసిన విమర్శలను భారత్ తిప్పికొట్టింది.

Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్

Yaseen

Yasin Malik: జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు జీవిత ఖైదు విధించడం పట్ల ఓఐసీ-ఐపీహెచ్‌ఆర్సీ చేసిన విమర్శలను భారత్ తిప్పికొట్టింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ మీడియాతో మాట్లాడుతూ…‘‘యాసిన్ మాలిక్ కేసులో కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో భారత్‌ను విమర్శిస్తూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ)-ఇండిపెండెంట్ పర్మనంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఐపీహెచ్‌ఆర్సీ) చేసిన వ్యాఖ్యలు సరికాదు’’ అని అన్నారు.

Train Delayed By 1 Year : ఒకరోజు కాదు ఏకంగా ఏడాది లేటుగా చేరుకున్న రైలు..! షాక్ అయిన అధికారులు..!!

‘‘యాసిన్ మాలిక్ పాల్పడ్డ ఉగ్రవాద కార్యకలాపాలను పరోక్షంగా సమర్థిస్తున్నట్లు ఓఐసీ-ఐపీహెచ్‌ఆర్సీ వ్యాఖ్యలు ఉన్నాయి. యాసిన్ మాలిక్ పాల్పడ్డ నేరాలకు సంబంధించిన పూర్తి ఆధారాలనూ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఉగ్రవాదాన్ని ఏ మాత్రమూ ఉపేక్షించవద్దని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ఓఐసీ ఏ రూపంలోనూ సమర్థించవద్దని మేము కోరుతున్నాం’’ అని అరిందం బాగ్చీ చెప్పారు.

Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ

కాగా, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, భారత్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నడం వంటి నేరాలపై విచారణ జరిపిన ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు ఇటీవల యాసిన్ మాలిక్‌కు శిక్ష విధించడంతో ఓఐసీ తాజాగా పలు వ్యాఖ్యలు చేసింది. కశ్మీరీ ముస్లింలను పీడిస్తున్నారని పేర్కొంది. ఇటువంటి చర్యలకు పాల్పడడం మానవ హక్కులను ఉల్లంఘించడమేనని చెప్పుకొచ్చింది. యాసిన్ మాలిక్ కొన్ని దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్‌లో స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించాడని ఓఐసీ పేర్కొంది. ఆయనకు జైలు శిక్ష విధించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే దీనిపై భారత్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది.