Train Delayed By 1 Year : ఒకరోజు కాదు ఏకంగా ఏడాది లేటుగా చేరుకున్న రైలు..! షాక్ అయిన అధికారులు..!!

ఒకరోజు కాదు రెండు రోజులు కూడా కాదు ఒక రైలు గమ్యస్థానానికి ఏకంగా ఏడాది లేటుగా చేరుకుంది. షెడ్యూల్ లేని ప్రకారంగా వచ్చిన ఆ రైలును చూసిన అధికారులు షాక్ అయ్యారు..!!

Train Delayed By 1 Year : ఒకరోజు కాదు ఏకంగా ఏడాది లేటుగా చేరుకున్న రైలు..! షాక్ అయిన అధికారులు..!!

Goods Train Delayed By One Year  In Jharkhand (3)

Goods Train delayed by one year  in Jharkhand : మన దేశంలో రైళ్లు ఆలస్యంగా వచ్చే విషయంలో ఎన్నో జోకులు పేలుతుంటాయి. రైలు జీవితకాలం లేటు అన్నట్లు అనే సామెతలు ఉంటాయి. కానీ ఓ రైలు మాత్రం లేటు అనే పదానికి అర్థమే మార్చేసింది. ఒక గంటో రెండు గంటలో కాదు అలాగని 10..20 గంటలు కాదు పోనీ ఒక రోజు కాదు రెండు రోజులు కూడా కాదు ఏఖంగా చేరాల్సిన గమ్యస్థానానికి ‘సంవత్సరం’ లేటుగా చేరుకుంది. దీంతో జరగాల్సిన నష్టం అంతా ఇంతా కాదు…!! ఝార్ఖండ్​లో జరిగిన ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యం అని కచ్చితంగా చెప్పాల్సిందే..ఈ రైలు ఏడాది కాలంపాటు లేటుగా రావటంతో పేదలకు అందాల్సిన ఆహారం కాస్తా పూర్తిగా పాడైపోయింది.

ఆహార ధాన్యాల లోడుతో ఏడాది క్రితం ఛత్తీస్​గఢ్ నుంచి రావాల్సిన రైలు..మే 17న గమ్యస్థానం చేరింది..!! ఝార్ఖండ్​ గిరీడీలో జరిగిన ఈ ఘటన రైల్వే శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు..2021 మేలో ఛత్తీస్‌గఢ్‌లోని ఓ రైల్వేస్టేషన్‌లో ఒక రైలు బోగిని 1000 బస్తాలతో లోడ్ చేశారు. ఈ రైలు 762 కిలోమీటర్లు ప్రయాణించి ఝార్ఖండ్‌లోని న్యూ గిరిడీ స్టేషన్‌ను చేరుకోవాలి. కానీ ఒక్క అంగుళం కూడా కదలకుండానే టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. సాధారణంగా అలా జరిగితే వెంటనే అధికారులు స్పందించాలి. కానీ ఎవ్వరు ఈ విషయమే పట్టించుకోలేదు. ఆ బోగితో గూడ్సు రైలు ఎట్టకేలకు ఏడాది ఆలస్యంగా మే 17(2022)న న్యూ గిరిడీ స్టేషన్‌ను చేరుకుంది. షెడ్యూల్​తో ఏమాత్రం సంబంధం లేకుండా వచ్చిన ఈ బోగీని చూసి వారు నివ్వెరపోయారు. ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియాకు సంబంధించిన బియ్యం లోడు ఆ బోగీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. కాసేపటి తర్వాత న్యూ గిరీడీ స్టేషన్​ సిబ్బందికి అసలు విషయం అర్థమవగా.. వారంతా షాకయ్యారు.

ఏడాది ఆలస్యం కావడంతో.. 200-300 బస్తాల బియ్యం పాడైపోయాయి. అది చూసిన అధికారులు ఏం చేయాలో పాలుపోక వారి నిర్లక్ష్యానికి వారే చింతించారు. దీంతో ఇక చేసేదేమీ లేక ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఏడాది ఆలస్యం కారణంగా భారీ నష్టమే జరిగింది. ఆ బోగీలోని 200-300 బస్తాల బియ్యం పూర్తిగా పాడైపోయింది. మిగిలిన సరకు కూడా చాలా పాతదని, పనికొస్తుందో లేదో చెప్పలేమని చెబుతున్నారు. ఉన్నతాధికారులు వచ్చి పరిస్థితి పరిశీలించారు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తారని న్యూ గిరీడీ స్టేషన్​ మాస్టర్ పంకజ్ కుమార్ తెలిపారు.