IMD: ముందుగా ప్ర‌క‌టించిన దానికంటే ఈ వానాకాలంలో అధిక వ‌ర్షపాతం

నైరుతి రుతుప‌వ‌న సీజ‌న్‌లో ముందుగా అంచ‌నా వేసిన దాని కంటే అధికంగా వ‌ర్షపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

IMD: ముందుగా ప్ర‌క‌టించిన దానికంటే ఈ వానాకాలంలో అధిక వ‌ర్షపాతం

Rains

IMD: నైరుతి రుతుప‌వ‌న సీజ‌న్‌లో ముందుగా అంచ‌నా వేసిన దాని కంటే అధికంగా వ‌ర్షపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబ‌రు వ‌ర‌కు కొన‌సాగే నాలుగు నెల‌ల నైరుతి సీజ‌న్‌లో దీర్ఘ‌కాలిక స‌గ‌టు (లాంగ్ పీరియడ్ యావ‌రేజ్‌-ఎల్‌పీఏ) వ‌ర్ష‌పాతం 99 శాతంగా న‌మోదు అవుతుంద‌ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఎండీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, దీర్ఘ‌కాలిక స‌గ‌టు వ‌ర్ష‌పాతం 103 శాతంగా న‌మోద‌వుతుంద‌ని స‌వ‌రించిన అంచ‌నాల‌ను ఐఎండీ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది.

Naqvi: లోక్‌స‌భ స‌భ్యుడిగా కేంద్ర‌మంత్రి న‌ఖ్వీ పోటీ?

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ సారి వ‌ర్షాలు పుష్క‌లంగా కురుస్తాయ‌ని ఐఎండీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ మృత్యుంజ‌య మీడియాకు చెప్పారు. అలాగే, మధ్య భారత్‌లో దాదాపు దీర్ఘ‌కాలిక స‌గ‌టు వ‌ర్ష‌పాతం 106 శాతంగానూ న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న వివ‌రించారు. కాగా, నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ తీరాన్ని తాకాయ‌ని మే 29నే భార‌త వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మూడు రోజుల ముందే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి.