Naqvi: లోక్‌సభ సభ్యుడిగా కేంద్రమంత్రి నఖ్వీ పోటీ?
మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన వారికి మరోసారి టికెట్ ఇవ్వొద్దని బీజేపీ నిబంధన పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గానికి జూన్ 23న ఎన్నిక జరగనుంది.

Naqvi
Naqvi: కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ లోక్‌సభ సభ్యుడిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన రాజ్యసభ పదవీ కాలం ఈ ఏడాది జూలై 7తో ముగియనుంది. జూన్ 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇప్పటికే ప్రకటించగా అందులో నఖ్వీ పేరు లేదు. మంగళవారంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ముగుస్తుంది. దీంతో ఆయనను బీజేపీ లోక్‌సభ సభ్యుడిగా బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.
China: తైవాన్ గగనతలానికి ఒకేసారి 30 యుద్ధ విమానాలను పంపిన చైనా
మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన వారికి మరోసారి టికెట్ ఇవ్వొద్దని బీజేపీ నిబంధన పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గానికి జూన్ 23న ఎన్నిక జరగనుంది. ఆ నియోజక వర్గ ఎంపీ పదవికి సమాజ్ వాదీ ఎంపీ అజాం ఖాన్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. నఖ్వీ కూడా రామ్‌పూర్ ప్రాంతానికే చెందిన నేత కావడంతో ఆయనను ఈ స్థానం నుంచి బీజేపీ పోటీ చేయించే అవకాశం ఉంది. మరోవైపు, నఖ్వీని గవర్నర్‌గా నియమిస్తారన్న ఊహాగానాలూ వస్తున్నాయి.