India Electric Supercar: ఈ ఇండియన్ కార్.. టెస్లా కాదు.. అంతకుమించి

ఈ ఇండియన్ కార్ మార్కెట్లోకి వస్తే టెస్లా కార్ దిగదిడుపే. అలా ఉన్నాయి ఫీచర్లు మరి. రెండు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం, గంటకి 350 కిలోమీటర్లు గరిష్ట వేగం, 100 హార్స్‌ పవర్‌ కలిగిన పవర్‌ఫుల్ ఇంజన్‌, ఒక్క సారి రీఛార్జీ చేస్తే 700 కి.మీల ప్రయాణం చేయగల కెపాసిటీ..

India Electric Supercar: ఈ ఇండియన్ కార్.. టెస్లా కాదు.. అంతకుమించి

India Electric Car

India Electric Supercar: ఈ ఇండియన్ కార్ మార్కెట్లోకి వస్తే టెస్లా కార్ దిగదిడుపే. అలా ఉన్నాయి ఫీచర్లు మరి. రెండు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం, గంటకి 350 కిలోమీటర్లు గరిష్ట వేగం, 100 హార్స్‌ పవర్‌ కలిగిన పవర్‌ఫుల్ ఇంజన్‌, ఒక్క సారి రీఛార్జీ చేస్తే 700 కి.మీల ప్రయాణం చేయగల కెపాసిటీ.. ఇలాంటి ఫీచర్లతో టెస్లా కంపెనీ ఎస్‌ ప్లెయిడ్‌ 3 ఎలక్ట్రిక్‌ కారును మించి రెడీ అవుతుంది ఎంఎంఎం అజానీ ఎలక్ట్రిక్‌ కారు. శర్‌తక్‌పాల్‌ ఓనర్ గా ఉన్న పక్కా భారతీయ సంస్థ దీనిని రెడీ చేస్తుంది.

ఎలన్‌మస్క్‌… భారత్‌ల మధ్య ఎలక్ట్రిక్ వాహనాల నేపథ్యమై వేడివాడిగానే చర్చలు జరిగాయి. ఇంతలోనే ఎలన్‌మస్క్‌కు శర్‌తక్‌పాల్‌ నుంచి షాకింగ్ న్యూస్ వచ్చింది. తనకు ఆదర్శమని, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మార్కెట్‌లో టెస్లా ఓ బ్రాండ్‌ అని.. తాము బ్రాండ్‌ కిల్లర్‌‌మంటూ సవాల్‌కు సై అన్నాడు. త్వరలోనే తన కంపెనీ నుంచి రాబోతున్న సూపర్‌ ఎలక్ట్రిక్‌ కారు విశేషాలను తెలియజేశాడు.

MMM
మీన్‌ మెటల్‌ మోటార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (MMM)ను ముగ్గురు మిత్రులతో కలిసి 19 ఏళ్ల శర్‌తక్‌పాల్‌ 2012లో నెలకొల్పాడు. 2014లో భవిష్యత్తును అంచనా వేసి అజానీ అనే ‍బ్రాండ్‌ నేమ్‌తో ఇండియన్‌ మేడ్‌ ఫాస్టెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కారును రెడీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ స్టార్టప్‌లో శ్రమిస్తున్న వారి సంఖ్య నాలుగు నుంచి ఇరవైరెండుకి పెరిగింది. ఫాస్టెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కారు కాన్సెప్టు చివరి దశకు చేరుకోగా.. త్వరలోనే అజానీ కారుతో సంచలనాలు సృష్టిస్తామంటూ మార్కెట్‌ స్ట్రాటజీని ఇటీవల ఎంఎంఎ వెల్లడించింది.

కార్ స్పెషల్ ఏంటి?
ఎంఎంఎం ప్రైవేట్‌ లిమిలెడ్‌ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం… ఫస్ట్‌ ఇండియన్‌​ ఎలక్ట్రిక్‌ కారు అజానీ గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు. అందులో అమర్చిన 120 కిలోవాట్‌ బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే స్పీడ్‌ మోడ్‌లను బట్టి 550 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు.

986 బ్రేక్‌హార్స్‌ పవర్‌ ఇంజన్‌తో రెండు సెకన్లలోనే వంద కిలోమీటర్ల స్పీడు అందుకోగలదు. మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తోన్న స్పోర్ట్స్‌ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కారుని డిజైన్‌ ఉంటుంది. కంపెనీ రిలీజ్‌ చేసిన ఫోటోలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

ఫస్ట్ రిలీజ్ అక్కడే
అజానీ కారు 2022 ద్వితీయార్థంలో అజానీ ప్రొటోటైప్‌ సిద్ధమవుతుందని ఎంఎంఎం ప్రైవేట్‌ లిమిటెడ్‌ తెలిపింది. 2023 ప్రారంభంలో యూకేలో ఈ కారుని ఫస్ట్‌ రిలీజ్‌ చేయనున్నారు. ఆ మరుసటి ఏడాది యూఏఈలో అందుబాటులోకి తేనున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో జెండా పాతిన తర్వాత 2025లో ఇండియాకు తీసుకువస్తామని చెబుతున్నారు.

ఇండియాలో ఈ కారు ధర ఇండియాలో కనిష్టంగా 89 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఉండవచ్చట.

భారత్‌లో ఇంపోర్ట్ ట్యాక్స్‌లు ఎక్కువని.. అవి తగ్గిస్తేనే ఇండియాలోకి టెస్లా ఈవీ కార్లను తీసుకొస్తామని టెస్లా ఓనర్‌ ఎలన్‌ మస్క్‌ ప్రకటించారు. ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పెడితే పన్ను రాయితీ గురించి ఆలోచిస్తామంటూ ఇండియన్ గవర్నమెంట్ ఫీలర్‌ వదిలింది. మరోవైపు ఈవీ వెహికల్స్‌ తయారు చేసే సత్తా భారతీయులకు ఉందంటూ ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అధినేత భవీష్‌ అగర్వాల్‌ స్పందించారు.