Instagram New Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. బల్క్ డిలీట్ మెసేజ్‌లు, కామెంట్లు అన్నింటికి ఒకటే..!

మెటా యాజమాన్యంలోని ఫొటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇన్ స్టాలో పోస్టు చేసే ప్రతి కంటెంట్ ను ఈ బల్క్ ఫీచర్ ద్వారా సులభంగా వినియోగించుకోవచ్చు.

Instagram New Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. బల్క్ డిలీట్ మెసేజ్‌లు, కామెంట్లు అన్నింటికి ఒకటే..!

Instagram Rolls Out New Fea

Instagram New Feature : మెటా యాజమాన్యంలోని ఫొటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇన్ స్టాలో బల్క్ డిలీట్ మెసేజ్‌లు, కామెంట్లు, ఆర్కివ్స్ వంటి అన్నింటికి ఒకేసారి వినియోగించుకోవచ్చు. ఇన్ స్టాలో పోస్టు చేసే ప్రతి కంటెంట్ ను ఈ బల్క్ ఫీచర్ ద్వారా సులభంగా వినియోగించుకోవచ్చు.

‘My Activity’తో సహా అనేక ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని మెటా యాప్ ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది. గత ఏడాది చివరలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో తమ యాక్టివిటీని ఒకే చోట చూసేలా ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ అందించేందుకు ఆయా ఫీచర్లను టెస్టింగ్ చేయడం ప్రారంభించినట్టు కంపెనీ తన బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది.

‘MY Activity’గా పిలిచే ఈ కొత్త ఎక్స్ పీరియన్స్ అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇన్ స్టా యూజర్లు తమ కంటెంట్‌ కు సంబంధించి కామెంట్లు, రియాక్షన్లను తేదీల వారీగా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫిల్టర్ చేసుకోవచ్చు.

గతంలోని కామెంట్లు, లైక్స్, స్టోరీల రిప్లయ్ వంటి వాటిని ఒకే చోట సెర్చ్ చేసుకోవచ్చు. డిలీట్ చేసిన లేదా ఆర్కైవ్ చేసిన కంటెంట్‌ను కూడా ఇన్‌స్టా యూజర్లు.. సెర్చ్ హిస్టరీ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. ఆయా లింక్‌లను ప్లాట్‌ఫారమ్‌లో సెర్చ్ చేసి డౌన్‌లోడ్ డేటాను చూసేందుకు కూడా ఈ ఫీచర్ వినియోగించుకోవచ్చు. గతంలో ఇన్ స్టా కంపెనీ.. యూజర్ల అకౌంట్ హ్యాక్ అయిన వ్యక్తులకు ‘సెక్యూరిటీ చెకప్’ను ప్రవేశపెట్టింది.

ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. Login Activity చెకింగ్ చేయడంతో పాటు ప్రొఫైల్ డేటాను రివ్యూ చేసుకోవడం, లాగిన్ డేటాను కూడా పొందవచ్చు. ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ వంటి అకౌంట్లను రికవరీ చేసుకోవచ్చు. లేదంటే అప్ డేట్ చేసుకోవచ్చు.

ఇన్‌స్టా అకౌంట్ సురక్షితంగా ఉంచడానికి అవసరమైన సెక్యూరిటీ డేటాను ప్రొటెక్ట్ చేయడంలో యూజర్లకు మార్గనిర్దేశం చేస్తుంది. అలాగే, యూజర్లు కంపెనీ కమ్యూనిటీ మార్గదర్శకాలకు (Community Guidelines) విరుద్ధంగా ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు అకౌంట్ స్టేటస్‌లో కనిపిస్తుంది.

Read Also : Rail Projects in AP: ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వడం లేదు: కేంద్ర మంత్రి