iPhone 15 : ఐఫోన్ 14కు మించి.. భారీ అప్‌గ్రేడ్‌లతో ఐఫోన్ 15.. ఆ 5 ఫీచర్లు అతిపెద్ద హైలెట్.. అవేంటో తెలుసా?

iPhone 15 : ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఆపిల్ తమ ఐఫోన్ యూజర్ల కోసం సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి Apple iPhone 14 సిరీస్ లాంచ్ చేసింది. అయితే యూజర్లు కొత్త iPhone 14 మోడల్ కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

iPhone 15 : ఐఫోన్ 14కు మించి.. భారీ అప్‌గ్రేడ్‌లతో ఐఫోన్ 15.. ఆ 5 ఫీచర్లు అతిపెద్ద హైలెట్.. అవేంటో తెలుసా?

iPhone 15 likely to offer big upgrades over iPhone 14, 5 features we expect to see

iPhone 15 : ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఆపిల్ తమ ఐఫోన్ యూజర్ల కోసం సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి Apple iPhone 14 సిరీస్ లాంచ్ చేసింది. అయితే యూజర్లు కొత్త iPhone 14 మోడల్ కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే iPhone 14 మోడల్.. iPhone 13 కన్నా పెద్దగా అప్‌గ్రేడ్ కాదు. దాదాపు అన్ని ఫీచర్లు ఐఫోన్ 13 మాదిరిగానే ఉన్నాయి. అందుకే iPhone 14 కొనేందుకు కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. చాలా మంది యూజర్లు తమ పాత ఐఫోన్ మోడల్‌ను ఐఫోన్ 14కి అప్‌గ్రేడ్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఐఫోన్ 14 మోడల్‌కు మించి ఐఫోన్ 15 అప్‌గ్రేడ్ రాబోతుంది.

ఆపిల్ సాంప్రదాయం ప్రకారం.. ఆపిల్ వచ్చే ఏడాది సమయంలో ఐఫోన్ 15ను లాంచ్ చేయనుంది. ఆపిల్ నెక్స్ట్ ఐఫోన్ మోడల్ లాంచ్ చేసేందుకు ఇంకా దాదాపు ఒక ఏడాది సమయం ఉంది. ఐఫోన్ 15 రాకముందే మోడల్ ఎలా ఉంటుంది? అనేదానిపై పుకార్లు, లీక్‌లు మొదలయ్యాయి. ఐఫోన్ 14 అప్ గ్రేడ్ మోడల్ ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

iPhone 15 likely to offer big upgrades over iPhone 14, 5 features we expect to see

iPhone 15 likely to offer big upgrades over iPhone 14, 5 features we expect to see

ఐఫోన్ 15 రిలీజ్ కావడానికి ముందే వివరాలను వెల్లడించలేదు. రుమర్లను పరిగణనలోకి తీసుకుంటే.. Apple iPhone 15 మోడల్ పెద్ద మార్పులు చేయబోతోంది. ఈ ఏడాదిలో iPhone 14 ఆశించిన స్థాయిలో మార్పులు చేయలేదు. బహుశా సరఫరా గొలుసు పరిమితుల వల్ల కావచ్చు. వచ్చే ఏడాదిలో Apple iPhone 15కి పెద్ద మార్పులను తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. వచ్చే iPhone 15 మోడల్‌ ఎలాంటి కొత్త ఫీచర్లతో రానుందో ఓసారి లుక్కేద్దాం.

* Better Hardware : iPhone 14 పాత ప్రాసెసర్‌తో వస్తుంది. iPhone 13 మాదిరిగానే రన్ అవుతుంది. కానీ, iPhone 15 విషయంలో అలా ఉండకపోవచ్చు. రాబోయే iPhone మోడల్ కొత్త బయోనిక్ చిప్‌సెట్, A17తో వస్తుందని కంపెనీ చెబుతోంది. బయోనిక్ చిప్.. ఈ ఏడాదిలో iPhone 14, iPhone 14 Plus A15 బయోనిక్ చిప్‌తో వస్తాయి. అయితే ప్రో మోడల్‌లు A16 బయోనిక్ చిప్‌తో వస్తాయి. 2023 ఐఫోన్ లైనప్ కోసం Qualcomm నుంచి సోర్స్ మోడెమ్ చిప్‌లను iPhone 15 కొనసాగిస్తుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

* USB Type C : ఈయూ అన్ని మొబైల్ ఫోన్‌లకు సాధారణ USB టైప్-C ఛార్జర్‌ని ఉపయోగించడం తప్పనిసరి చేసింది. ఈ విధానం Appleకి కూడా వర్తిస్తుంది. భవిష్యత్తులో ఐఫోన్ మోడల్‌లు లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా USB టైప్-C పోర్ట్‌ను అందిస్తాయని భావించవచ్చు. భారత మార్కెట్లో కూడా అతి త్వరలో సాధారణ ఛార్జర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆపిల్ భావిస్తోంది. ప్రస్తుతం దీనిపై కంపెనీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.

iPhone 15 likely to offer big upgrades over iPhone 14, 5 features we expect to see

iPhone 15 likely to offer big upgrades over iPhone 14, 5 features we expect to see

* Dynamic Island : Apple ఈ ఏడాదికి డైనమిక్ ఐలాండ్ అని పిలిచే విభిన్న శైలి నాచ్‌ని ప్రవేశపెట్టింది. కానీ, ప్రో మోడల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అన్ని ఐఫోన్ 15 మోడళ్లలో డైనమిక్ ఐలాండ్ ప్రవేశపెట్టబడుతుందని భావిస్తున్నారు. Apple చివరకు iPhone Xతో లాంచ్ అయిన వైడ్-నాచ్డ్ డిజైన్‌ను తొలగిస్తుందా? లేదా అనేది క్లారిటీ లేదు.

* Periscope Lens : పెరిస్కోప్ లెన్స్‌పై ఆపిల్ పని చేస్తుందని ఎప్పటినుంచో తెలిసిన విషయమే. ఐఫోన్ 15 మోడళ్లలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెరిస్కోప్ లెన్స్‌ని చూసే అవకాశం ఉంది. ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలను అందిస్తుంది. పెరిస్కోప్ లెన్స్‌తో, ఆపిల్ ప్రస్తుత iPhone 14 Pro మోడల్‌లలో 3x నుండి 5x లేదా 10x ఆప్టికల్ జూమ్ అప్‌ను అందించవచ్చని తెలిపింది.

* Better Battery Life : ప్రతి మోడల్‌తో, ఆపిల్ ఐఫోన్‌ల బ్యాటరీ లైఫ్ మెరుగుపరుస్తుంది. iPhone 12, iPhone 13తో పోల్చినప్పుడు.. iPhone 14 కొంచెం మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. iPhone 15తో కూడా అదే సంప్రదాయంతో వస్తోంది. మరో మాటలో చెప్పాలంటే, iPhone 15 డివైజ్ ఒకసారి ఛార్జ్ చేస్తే.. ఆ రోజుంతా బ్యాటరీ లైఫ్ ఇస్తుందని చెప్పవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 13 Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. తక్కువ ధరకే పొందాలంటే ఇదొక్కటే మార్గం.. డోంట్ మిస్..!