iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. విండోస్ PCల నుంచి నేరుగా ఐమెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు..!

iPhone Users : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇప్పటినుంచి ఐఫోన్ వినియోగదారులు తమ ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ మధ్య కనెక్టివిటీని ఈజీగా కొనసాగించవచ్చు. ఇందుకోసం ఖరీదైన Macని కొనుగోలు చేయనవసరం లేదు.

iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. విండోస్ PCల నుంచి నేరుగా ఐమెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు..!

iPhone users can now send iMessage, take calls directly from Windows PCs

iPhone Users : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇప్పటినుంచి ఐఫోన్ వినియోగదారులు తమ ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ మధ్య కనెక్టివిటీని ఈజీగా కొనసాగించవచ్చు. ఇందుకోసం ఖరీదైన Macని కొనుగోలు చేయనవసరం లేదు. ఈ కొత్త విండోస్ (Windows 11) అప్‌డేట్‌లో భాగంగా iPhone యూజర్లు PCలో నేరుగా మెసేజ్‌లను పంపవచ్చు.

అలాగే ఫోన్ కాల్‌లను స్వీకరించవచ్చు. నోటిఫికేషన్‌లను కూడా పొందవచ్చు. మైక్రోసాఫ్ట్ అప్‌డేట్ చేసిన ఫోన్ లింక్ డెస్క్‌టాప్ యాప్ ద్వారా iPhone, Windows PCలను లింక్ చేయడం ద్వారా పొందవచ్చు. డెస్క్‌టాప్ యాప్ Windows PCలలో ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఇప్పటివరకు, Android యూజర్లు తమ ఫోన్‌ను ల్యాప్‌టాప్‌కు సింకరైజ్ చేసేందుకు మాత్రమే అనుమతించింది.

విండోస్ 11 PCతో iPhoneని ఎలా లింక్ చేయాలంటే? :
ప్రస్తుతం, (Windows Insider) బీటా ఛానెల్ ప్రోగ్రామ్‌లోని యూజర్లు మాత్రమే ఫీచర్ టెస్టింగ్ చేయొచ్చు. మొదట్లో తక్కువ శాతం ఇన్‌సైడర్‌లతో ఈ ప్రివ్యూని పొందవచ్చు. ఇన్‌సైడర్‌లందరూ వెంటనే ప్రివ్యూని చూడలేరు. లేకపోతే, ఇప్పటికే ఇన్‌సైడర్ ప్రోగ్రామ్‌లో ఉన్న యూజర్లు ఫోన్ లింక్ యాప్ వెర్షన్ 1.23012.169.0 అంతకంటే ఎక్కువ వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవాలి.

iPhone users can now send iMessage, take calls directly from Windows PCs

iPhone users can now send iMessage, take calls directly from Windows PCs

Read Also : Next iPhone SE 4 Launch : భారీ OLED డిస్‌ప్లేతో ఐఫోన్ SE4 వస్తోంది.. ఇంటర్నల్ 5G మోడమ్, మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు..

మీకు యాక్సెస్ ఉంటే.. ఫోన్ లింక్ యాప్ ‘iPhone’ ఆప్షన్ అందిస్తుంది. ఐఫోన్‌ను ఎంచుకున్న తర్వాత యూజర్లు బ్లూటూత్ ద్వారా కనెక్షన్‌ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ దశ తర్వాత యూజర్లు QR కోడ్‌ని స్కాన్ చేయమని ప్రాంప్ట్ కనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ ‘మీ ఐఫోన్ నుంచి ఫోన్ లింక్‌లో నోటిఫికేషన్‌లు, కాంటాక్టులను సరిగ్గా చూపించడానికి ఒక ముఖ్యమైన దశ అని చెప్పవచ్చు.

iOS ఫీచర్‌తో ఫోన్ లింక్? :
ఈ ఫోన్ లింక్ యాప్ కాల్‌లు, మెసేజ్‌లు కాంటాక్టుల కోసం ప్రైమరీ iOS సపోర్టును అందిస్తుంది. మీ (Windows) నోటిఫికేషన్‌ల ద్వారా నేరుగా పొందవచ్చు. iOS కోసం ఫోన్ లింక్ గ్రూపు మెసేజ్‌లకు రిప్లే ఇవ్వడానికి లేదా మీడియా మెసేజ్ పంపడానికి సపోర్టు ఇవ్వదు. విండోస్ సిస్టమ్ బ్లూటూత్ ద్వారా మెసేజ్ పంపుతుందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఒకవేళ.. రిసీవర్ ఐఫోన్‌ను ఉపయోగిస్తుంటే ఆపిల్ వాటిని ఐమెసేజ్‌గా మారుస్తుంది. అప్‌డేట్ చేసిన ఫోన్ లింక్ యాప్ ఫుల్ చాట్ హిస్టరీని అందించదు.

iPhone users can now send iMessage, take calls directly from Windows PCs

iPhone users can now send iMessage, take calls directly from Windows PCs

అంతేకాకుండా, ఫోన్ లింక్ యాప్‌లో మైక్రోసాఫ్ట్ బ్లూ లేదా గ్రీన్ బబుల్స్ ఉపయోగించదు. అప్‌డేట్ చేసిన ఫోన్ లింక్ యాప్ iPhoneలలో సేవ్ చేసిన ఫొటోలను ప్రదర్శించదు. PCతో సింకరైజ్ చేసిన Android ఫోన్‌ల విషయంలో ఇది ఉండదని గమనించాలి. అయినప్పటికీ, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఐక్లౌడ్ ఫొటోలను లోకల్ విండోస్ ఫొటోల యాప్‌లోకి సింకరైజ్ ఆప్షన్ అందిస్తుంది. iOS కోసం ఫోన్ లింక్ ఎంపిక చేసిన బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. మైక్రోసాఫ్ట్ 2023 చివరిలో నెక్స్ట్ ప్రధాన Windows 11 అప్‌డేట్‌తో ఫీచర్‌ను రిలీజ్ చేయవచ్చు.

Read Also : iPhone 15 Series : అద్భుతమైన కలర్ ఆప్షన్లలో ఐఫోన్ 15 సిరీస్ వస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?