IPL 2022: కోల్‌కతాకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్

శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ప్రకటిస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ 2022 వేలం ముగిసిన రోజుల వ్యవధిలోనే ప్రకటించడం విశేషం. ఫిబ్రవరి 12, 13తేదీల్లో..

IPL 2022: కోల్‌కతాకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్

Kkr Shreyas

IPL 2022: శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ప్రకటిస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ 2022 వేలం ముగిసిన రోజుల వ్యవధిలోనే ప్రకటించడం విశేషం. ఫిబ్రవరి 12, 13తేదీల్లో జరిగిన వేలం ప్రక్రియలో శ్రేయాస్ అయ్యర్ ను రూ.12.25కోట్లకు కొనుగోలు చేసింది ఫ్రాంచైజీ. 2020వ సీజన్ కు గానూ ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్సీ వహించిన శ్రేయాస్.. తర్వాతి సీజన్‌లో గాయం కారణంగా లీగ్‌కు దూరమయ్యాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ కు రిషబ్ పంత్ కెప్టెన్ కాగా, వేలానికి వదిలిపెట్టేసింది ఢిల్లీ ఫ్రాంచైజీ. అలా సొంతం చేసుకున్న కోల్‌కతా అనూహ్య నిర్ణయం తీసుకుంటూ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు కేకేఆర్ సీఈఓ, మేనేజింగ్ డైరక్టర్ వెంకీ మైసూర్ అధికారికంగా ప్రకటించారు.

‘”ఐపీఎల్ వేలంలో శ్రేయాస్‌ను వేలంలో విజయవంతంగా సొంతం చేసుకోగలిగాం. #TeamKKRకి నాయకత్వం వహించే అవకాశం ఇస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం. అత్యున్నత స్థాయిలో నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌గా అందరినీ ఆకట్టుకున్నాడు. #TeamKKR నాయకుడిగా రాణిస్తాడనే నమ్మకం మాకుంది’

Shreyas Iyer: కెప్టెన్సీ కోసం శ్రేయాస్ అయ్యర్ ఎదురుచూపులు

రెండుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన బ్యాట్స్‌మెన్‌కు ఇది సరికొత్త ప్రారంభం కానుందని, శ్రేయాస్‌తో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడు.

‘ఇండియన్ ఫ్యూచర్ కెప్టెన్స్‌లో ఒకరైన శ్రేయాస్ అయ్యర్, KKRలో పగ్గాలు చేపట్టినందుకు చాలా సంతోషిస్తున్నా. శ్రేయాస్ ఆటను, అతని కెప్టెన్సీ నైపుణ్యాలను చాలా దూరం నుంచి ఆస్వాదించా. ఇప్పుడు KKRలో కావలసిన విజయాన్ని, ఆట శైలిని ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహితంగా పనిచేయడానికి ఎదురుచూస్తున్నా” అని మెకల్లమ్ వివరించాడు.

దీనిపై స్పందించిన శ్రేయాస్ అయ్యర్.. “KKR వంటి ప్రతిష్టాత్మక జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నా. IPL టోర్నమెంట్‌గా వివిధ దేశాలు, సంస్కృతుల నుంచి అత్యుత్తమ ఆటగాళ్లను ఒకచోట చేర్చింది. ఈ టీమ్‌కు కెప్టెన్సీ వహించే అవకాశాన్ని కల్పించినందుకు KKR యాజమాన్యం, నిర్వహణ, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా అభిమానులను జట్టుగా గర్వించేలా చేయడానికి ఎదురుచూస్తున్నా” అని శ్రేయాస్ అయ్యర్ అంటున్నాడు.

IPL 2022: భారీ ధరతో కోల్‌కతాకు శ్రేయాస్.. పంజాబ్‌కు ధావన్.. గుజరాత్‌కు షమీ