KKR vs LSG: ఉత్కంఠ పోరులో కోల్‌కతా పై లక్నో గెలుపు
ఐపీఎల్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.

LSG vs KKR
IPL 2023: ఐపీఎల్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న మూడో జట్టుగా లక్నో నిలిచింది.
LIVE NEWS & UPDATES
-
గెలిచిన లక్నో
ఐపీఎల్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న మూడో జట్టుగా లక్నో నిలిచింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది. దీంతో లక్నో 1 పరుగు తేడాతో విజయం సాధించింది.
-
రస్సెల్ ఔట్
కోల్‌కతాకు భారీ షాక్ తగిలింది. ఆండ్రీ రస్సెల్(7) ఔట్ అయ్యాడు. రవిబిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 120 పరుగుల(15.4వ ఓవర్) వద్ద కోల్‌కతా ఐదో వికెట్ కోల్పోయింది.
-
గుర్భాజ్ ఔట్
యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్ క్యాచ్ అందుకోవడంతో రెహ్మనుల్లా గుర్భాజ్(16) ఔట్ అయ్యాడు. దీంతో 108 పరుగుల(13.4వ ఓవర్) వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.
-
నితీశ్ రాణా ఔట్
కోల్‌కతా మరో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా క్యాచ్ అందుకోవడంతో నితీశ్ రాణా(8) ఔట్ అయ్యాడు. దీంతో కోల్‌కతా 78 పరుగుల(8.3వ ఓవర్) వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
-
వెంకటేశ్ అయ్యర్ ఔట్
కోల్‌కతాకు షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్(24) ఔట్ అయ్యాడు. కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో రవిబిష్ణోయ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 61 పరుగుల వద్ద కోల్‌కతా మొదటి వికెట్ కోల్పోయింది. 6 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 61/1. నితీశ్ రాణా(0), జేసన్ రాయ్(36) లు క్రీజులో ఉన్నారు.
-
కోల్‌కతా లక్ష్యం 177
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్(58; 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా, క్వింటన్ డికాక్(28), ప్రేరక్ మన్కడ్(26), ఆయుష్ బదోని(25) లు ఫర్వాలేదనిపించారు. కరన్ శర్మ(3), మార్కస్ స్టోయినిస్(0), కెప్టెన్ కృనాల్ పాండ్యా(9)లు విఫలం అయ్యారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా లు తలా రెండు వికెట్లు తీయగా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
-
సిక్స్‌తో పూరన్ అర్ధశతకం.. ఆ వెంటనే ఔట్
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో(18.1) నికోలస్ పూరన్ సిక్స్ కొట్టి 29 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే మరో సిక్స్ కొట్టిన పూరన్(58) ఆ మరుసటి బంతికే వెంకటేశ్ అయ్యర్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో 159 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్ కోల్పోయింది.
-
స్వల్ప వ్యవధిలో కృనాల్ పాండ్యా, డికాక్ ఔట్
స్వల్ప వ్యవధిలో లక్నో రెండు వికెట్లు కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో(9.4వ ఓవర్) రింకూ సింగ్ క్యాచ్ అందుకోవడంతో కృనాల్ పాండ్యా(9) ఔట్ కాగా.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో(10.1వ ఓవర్) రస్సెల్(28)కు క్యాచ్ ఇచ్చి డికాక్(28) పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో లక్నో 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 11 ఓవర్లకు లక్నో స్కోరు 83/5. నికోలస్ పూరన్(15), ఆయుష్ బదోని(1)లు క్రీజులో ఉన్నారు.
-
స్టోయినిస్ ఔట్
లక్నో మరో వికెట్ కోల్పోయింది. వైభవ్ అరోరా బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ క్యాచ్ అందుకోవడంతో మార్కస్ స్టోయినిస్(0) డకౌట్ అయ్యాడు. దీంతో 55 పరుగుల(6.5వ ఓవర్) వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లకు లక్నో స్కోరు 55/3. డికాక్ (21), కృనాల్ పాండ్యా(0)లు క్రీజులో ఉన్నారు.
-
ధాటిగా ఆడుతున్న డికాక్. మన్కడ్
వికెట్ కోల్పోయినప్పటికి క్వింటన్ డికాక్, ప్రేరక్ మన్కడ్ లు ధాటిగా ఆడుతున్నారు. పవర్ ప్లే ముగిసే సరికి లక్నో స్కోరు 54/1. డికాక్ 13 బంతుల్లో 20, మన్కడ్ 19 బంతుల్లో 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
కరణ్ శర్మ ఔట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టుకు షాక్ తగిలింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో కరణ్ శర్మ(3) శార్దూల్ ఠాకూర్ చేతికి చిక్కాడు. దీంతో లక్నో 14 పరుగుల(2.3వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
-
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జేసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
-
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ఆయుష్ బడోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్