IPL 2023: పంజాబ్‌పై రాజ‌స్థాన్ విజ‌యం

ఐపీఎల్ 2023లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది.

IPL 2023: పంజాబ్‌పై రాజ‌స్థాన్ విజ‌యం

PBKS vs RR

PBKS vs RR: ఐపీఎల్ 2023లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది.పంజాబ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 19.4 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 19 May 2023 11:26 PM (IST)

    రాజ‌స్థాన్ విజ‌యం

    ఐపీఎల్ 2023లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 19.4 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్ స‌జీవంగా ఉన్నాయి. మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల‌పై రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్ చేరేది లేనిది ఆధార‌ప‌డి ఉంది.

  • 19 May 2023 11:17 PM (IST)

    షిమ్రాన్ హెట్మెయర్ ఔట్‌.. ఉత్కంఠ‌గా మారిన మ్యాచ్‌

    దూకుడుగా ఆడుతున్న షిమ్రాన్ హెట్మెయర్(46) ఔట్ అయ్యాడు. సామ్ క‌ర‌న్ బౌలింగ్‌లో శిఖ‌ర్ ధావ‌న్ చేతికి చిక్కాడు. దీంతో రాజ‌స్థాన్ 179 ప‌రుగుల(18.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది. రాజ‌స్థాన్ విజ‌యానికి 7 బంతుల్లో 9 ప‌రుగులు అవ‌స‌రం.

  • 19 May 2023 11:14 PM (IST)

    రియాన్ ప‌రాగ్ ఔట్‌

    దూకుడుగా ఆడుతున్న రియాన్ ప‌రాగ్‌(20) ఔట్ అయ్యాడు. 18వ ఓవ‌ర్‌ను ర‌బాడ వేయ‌గా ప‌రాగ్ రెండు సిక్స్‌లు కొట్టాడు. అదే ఊపులో ఆఖ‌రి బంతికి అథర్వ తైదే క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో రాజ‌స్థాన్ 169 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

  • 19 May 2023 10:50 PM (IST)

    య‌శ‌స్వి జైశ్వాల్ ఔట్‌

    య‌శ‌స్వి జైశ్వాల్ హాఫ్ సెంచ‌రీ చేసిన‌ కాసేటికే రిషి ధావ‌న్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో రాజ‌స్థాన్ 137 ప‌రుగుల(14.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద రాజ‌స్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 19 May 2023 10:46 PM (IST)

    య‌శ‌స్వి జైశ్వాల్ అర్ధ‌శ‌త‌కం

    య‌శ‌స్వి జైశ్వాల్ త‌న ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. నాథ‌న్ ఎల్లిస్ బౌలింగ్‌లో(14.1వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 35 బంతుల్లో 8 ఫోర్ల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఇది జైస్వాల్‌కు 8వ అర్ధ‌శ‌త‌కం

  • 19 May 2023 10:32 PM (IST)

    శాంస‌న్ ఔట్‌

    రాజ‌స్థాన్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయింది. రాహుల్ చాహ‌ర్ బౌలింగ్‌లో రిషిధావ‌న్ క్యాచ్ అందుకోవ‌డంతో సంజు శాంస‌న్ (2) ఔట్ అయ్యాడు. దీంతో రాజ‌స్థాన్ 90 ప‌రుగుల(10.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

  • 19 May 2023 10:23 PM (IST)

    ప‌డిక్క‌ల్ అర్ధ‌శత‌కం.. ఆ వెంట‌నే ఔట్‌

    ప‌దో ఓవ‌ర్‌ను అర్ష్‌దీప్ సింగ్ వేయ‌గా నాలుగో బంతికి రెండు ప‌రుగులు తీసిన ప‌డిక్క‌ల్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ మ‌రుస‌టి బంతికే హర్‌ప్రీత్ బ్రార్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో రాజ‌స్థాన్ 85 ప‌రుగుల(9.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 10 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ 86/2. య‌శ‌స్వి జైస్వాల్‌(32), సంజు శాంస‌న్ (1) క్రీజులో ఉన్నారు.

  • 19 May 2023 10:04 PM (IST)

    దూకుడుగా ఆడుతున్న య‌శ‌స్వి, ప‌డిక్క‌ల్‌

    ఆరంభంలోనే బ‌ట్ల‌ర్ వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికీ ఆ ప్ర‌భావం ప‌డ‌కుండా య‌శ‌స్వి జైస్వాల్‌, ప‌డిక్క‌ల్‌లు ధాటిగా ఆడుతున్నారు. ప‌వ‌ర్ ప్లే(6 ఓవ‌ర్లు) ముగిసే స‌రికి రాజ‌స్థాన్ 57/1తో నిలిచింది. ప‌డిక్క‌ల్ 17 బంతుల్లో 33, జైస్వాల్ 15 బంతుల్లో 23 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 19 May 2023 09:48 PM (IST)

    బ‌ట్ల‌ర్ ఔట్

    ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. బ‌ట్ల‌ర్ మ‌ళ్లీ డ‌కౌట్ అయ్యాడు. రబాడ బౌలింగ్‌లో ఎల్భీగా పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో రాజ‌స్థాన్ 12 ప‌రుగుల(1.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 16/1. ప‌డిక్క‌ల్‌(4), య‌శ‌స్వి జైస్వాల్‌(12)లు క్రీజులో ఉన్నారు.

  • 19 May 2023 09:22 PM (IST)

    రాజ‌స్థాన్ ల‌క్ష్యం 188

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో సామ్ క‌ర‌న్‌(49 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), జితేశ్ శ‌ర్మ‌(44; 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), షారుక్ ఖాన్‌(41 నాటౌట్; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ధాటిగా ఆడారు. మిగిలిన వారిలో లివింగ్ స్టోన్‌(9), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(2)లు విఫ‌లం కాగా.. ధావ‌న్‌(17), అథర్వ తైదే(19) ప‌ర్వాలేద‌నిపించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో న‌వ‌దీప్ సైనీ మూడు వికెట్లు తీయ‌గా, బౌల్ట్‌, జంపా చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 19 May 2023 08:46 PM (IST)

    జితేశ్ శ‌ర్మ ఔట్‌

    దూకుడుగా ఆడుతున్న జితేశ్ శ‌ర్మ(44) ఔట్ అయ్యాడు. 14వ ఓవ‌ర్‌ను న‌వ‌దీప్ సైనీ వేయ‌గా రెండు, మూడు, నాలుగు బంతుల‌ను వ‌రుస‌గా 4, 6, 4 గా మ‌లిచిన జితేశ్ ఐదో బంతికి సైతం భారీ షాట్‌కు య‌త్నించి ఫెరీరా చేతికి చిక్కాడు. దీంతో 114 ప‌రుగుల(13.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. 14 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 115/5. సామ్ క‌ర‌న్‌(18), షారుక్ ఖాన్‌(1) లు క్రీజులో ఉన్నారు.

  • 19 May 2023 08:28 PM (IST)

    నిల‌క‌డ‌గా ఆడుతున్న పంజాబ్ బ్యాట‌ర్లు

    నాలుగు వికెట్లు కోల్పోవ‌డంతో క‌ష్టాల్లో ప‌డిన‌ పంజాబ్‌ను జితేశ్ శ‌ర్మ‌, సామ్‌క‌ర‌న్‌లు ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 10 ఓవ‌ర్ల‌కు పంజాబ్‌ స్కోరు 78/4. సామ్ క‌ర‌న్‌(8), జితేశ్ శ‌ర్మ‌(20) లు క్రీజులో ఉన్నారు.

  • 19 May 2023 08:12 PM (IST)

    లివింగ్ స్టోన్ క్లీన్ బౌల్డ్

    పంజాబ్ బ్యాట‌ర్లు వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతున్నారు. న‌వ‌దీప్ సైనీ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ 50 ప‌రుగుల(6.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవ‌ర్ల‌కు స్కోరు 53/4. సామ్ క‌ర‌న్‌(2), జితేశ్ శ‌ర్మ‌(1) లు క్రీజులో ఉన్నారు.

  • 19 May 2023 08:07 PM (IST)

    ధావ‌న్ ఔట్‌

    పంజాబ్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్(17) ఎల్భీగా పెవిలియ‌న్ కు చేరుకున్నాడు. దీంతో 46 ప‌రుగుల(5.3వ ఓవ‌ర్‌) వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 6 ఓవ‌ర్ల‌కు స్కోరు 48/3. లియామ్ లివింగ్ స్టోన్(4), సామ్ క‌ర‌న్‌(1) లు క్రీజులో ఉన్నారు.

  • 19 May 2023 07:55 PM (IST)

    అథర్వ తైదే ఔట్‌

    పంజాబ్ మ‌రో వికెట్ కోల్పోయింది. అథర్వ తైదే(19) ఔట్ అయ్యాడు. నవదీప్ సైనీ బౌలింగ్‌లో ప‌డిక్క‌ల్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 38 ప‌రుగుల(3.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 4 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 42/2. శిఖర్ ధావన్(16), లియామ్ లివింగ్ స్టోన్(4) లు క్రీజులో ఉన్నారు.

  • 19 May 2023 07:37 PM (IST)

    ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఔట్‌

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు మొద‌టి ఓవ‌ర్‌లోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. రెండో బంతికి ప్రభ్‌సిమ్రాన్ సింగ్(2) ఔట్ అయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అత‌డికే క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో పంజాబ్ రెండు ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది. 1 ఓవ‌ర్‌కు పంజాబ్ స్కోరు 2/1. అథర్వ తైదే(0), శిఖర్ ధావన్(0) లు క్రీజులో ఉన్నారు.

  • 19 May 2023 07:23 PM (IST)

    రాజస్థాన్ రాయల్స్ తుది జ‌ట్టు

    యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

  • 19 May 2023 07:22 PM (IST)

    పంజాబ్ కింగ్స్ త‌ది జ‌ట్టు

    శిఖర్ ధావన్ (కెప్టెన్‌), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైదే, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్

  • 19 May 2023 07:04 PM (IST)

    టాస్ గెలిచిన రాజ‌స్థాన్‌

    ఐపీఎల్ 2023లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన రాజ‌స్థాన్ కెప్టెన్ సంజు శాంస‌న్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.