Asim Arun : ఇండియా – న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్..చెత్తను క్లీన్ చేసిన ఐపీఎస్

గ్రీన్ సిటీగా కాన్పూర్ ను మార్చి..అందంగా ఉంచాలనేది రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆకాంక్షించారని..అందుకే గ్రీన్ పార్క్ స్టేడియంలో ఉన్న చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచినట్లు తెలిపారు

Asim Arun : ఇండియా – న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్..చెత్తను క్లీన్ చేసిన ఐపీఎస్

Ips Officer

IND vs NZ IPS Officer : క్రికెట్ అంటే అభిమానం ఎవరికి ఉండదు. అది టీమిండియా మ్యాచ్ జరుగుతుందంటే..టీవీలకు అతుక్కపోతుంటారు. కొంతమంది మ్యాచ్ ను చూడాలని స్టేడియానికి వెళుతుంటారు. తమ అభిమాన క్రీడాకారులు ఆడుతుండడంతో వారి సంతోషానికి అవధులు ఉండవు. కేరింతలు కొడుతూ..వారిని ఉత్సాహపరుస్తుంటారు. అయితే..స్టేడియంలోకి వెళ్లేటప్పుడు…తినడానికి ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్, స్నాక్..ఇతరత్రా తీసుకెళుతుంటారు. మ్యాచ్ అయిపోయిన అనంతరం చెత్తనంతా అక్కడే పడేసి ఎవరిళ్లకు వారు వెళ్లిపోతుంటారు. అప్పటిదాక ఎంతో క్లీన్ గా ఉన్న స్టేడియం చెత్తతో అపరిశుభ్రంగా కనిపిస్తుంటుంది. కానీ..ఓ ఐపీఎస్ ఆఫీసర్ మ్యాచ్ చూసిన అనంతరం ప్రేక్షకులు పడేసిన చెత్తను సంచిలో పడేసి క్లీన్ చేశారు. ఆయన చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ ఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది.

Read More : NITI Aayog’s MPI : దేశంలో పేద రాష్ట్రాలు ఇవే..బీహార్ లో సగానికి పైగా జనాభా పేదరికంలోనే

న్యూజిలాండ్ – టీమిండియా జట్ల మధ్య టెస్టు మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆసీమ్ అరుణ్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా మ్యాచ్ ను చూడటానికి స్టేడియానికి వచ్చారు. ఆ రోజంతా మ్యాచ్ చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం అందరిలా వెళ్లిపోలేదు. స్టేడియంలో చెత్త పేరుకపోయిన సంగతి చూశారు. తిని పడేసిన ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ తో పాటు చెత్తను ఏరి సంచిలో పడేసి క్లీన్ చేశారు. అక్కడున్న ఇతరులు కూడా ఆయనకు జత కలిశారు.

Read More : TDP Vs YCP : అసలైన పూజ ఏంటో త్వరలో వైసీపీ బ్యాచ్‌కు అర్థమౌతుంది

గ్రీన్ సిటీగా కాన్పూర్ ను మార్చి..అందంగా ఉంచాలనేది రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆకాంక్షించారని..అందుకే గ్రీన్ పార్క్ స్టేడియంలో ఉన్న చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచినట్లు..ఇలా చేయడం సంతోషం కలిగించిందంటూ..ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. Utkarsh Gupta అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ చేసిన పనికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.