2024 Elections: ప్రధానమంత్రి పదవి అక్కర్లేదని కాంగ్రెస్ చాలాసార్లు వెనక్కి తగ్గింది. మరి ఈ మాట మీద ఎన్నిసార్లు నిలబడింది?

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే మద్దతు ఇచ్చి, ప్రభుత్వాన్ని పడగొట్టడంపై కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపింది. కాంగ్రెస్‌ మద్దతుతో జనతాదళ్ నేత హెచ్‌డీ దేవెగౌడ ప్రధాని అయ్యారు. కానీ సీతారాం కేసరి కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాగానే అకస్మాత్తుగా మద్దతు ఉపసంహరించుకున్నారు

2024 Elections: ప్రధానమంత్రి పదవి అక్కర్లేదని కాంగ్రెస్ చాలాసార్లు వెనక్కి తగ్గింది. మరి ఈ మాట మీద ఎన్నిసార్లు నిలబడింది?

Congress on PM Post Promise: వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం విపక్ష పార్టీలన్నీ ఎట్టకేలకు ఐక్యత సాధించాయి. ఈ నెల 8న బెంగళూరులో జరిగిన విపక్షాల మెగా సమావేశంలో సుమారు 26 విపక్ష పార్టీలు ‘ఇండియా’ అనే పేరుతో కూటమి కట్టాయి. అయితే దీనికి ముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి పదవిపై ఆసక్తి లేదని, తమ తాపత్రయం అంతా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని రక్షించడానికే అని చాలా పెద్ద ప్రకటనే చేశారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి.. ఏయే సెక్షన్ల కింద అంటే?

అయితే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రకటనలు చేయడం ఇది మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి ప్రకటనలు చేసింది. మరి అలా ప్రకటనలు చేసినప్పుడు కాంగ్రెస్ తన మాట మీద నిలబడిందా అంటే.. నిలబడింది కానీ, ఎక్కువ కాలం నిలబడలేదని చెప్పొచ్చు. పలుమార్లు పలువురిని ప్రధానిగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ అనతి కాలంలోనే ఆ ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీయే కూలదోసింది. మరి ఆ సందర్భాలను ఒకసారి పరిశీలిద్దామా..

చౌదరి చరణ్ సింగ్
భారత ప్రధానమంత్రిగా చౌదరి చరణ్ సింగ్ కేవలం 170 రోజులు మాత్రమే ఉన్నారు. కానీ భారత రాజకీయాల్లో ఆయన చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ముఖ్యంగా రైతులు ఆయనను అతిపెద్ద నాయకుడిగా భావిస్తారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ కూటమి తరపున చౌదరి చరణ్ సింగ్ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఆ సమయంలో దళిత నాయకుడు జగ్జీవన్ రామ్ ప్రధానమంత్రి రేసులో ఉన్నారు. దీంతో పోటీ నుంచి తప్పుకుని మొరార్జీ దేశాయ్‌కు మద్దతు ఇచ్చారు.

ఇందిర ప్రభుత్వాన్ని కూలదోసిన అనంతరం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే మొరార్జీ క్యాబినెట్‌లో చరణ్‌సింగ్, జగ్జీవన్ రామ్‌లను ఉపప్రధానులుగా చేశారు. కానీ ఈ ముగ్గురు నేతలకు పొసగలేదు. దీంతో ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండేళ్లలోపే కేంద్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం కూలిపోయింది. అయితే ప్రభుత్వ పతనానికి ఇదొక్కటే కారణం కాదు. మొరార్జీ ప్రభుత్వం పతనం అనంతరం ఇందిరా గాంధీ మద్దతుతో చరణ్ సింగ్ సభలో తన మెజారిటీని నిరూపించుకున్నారు. జూలై 28, 1979న సోషలిస్ట్ భావజాలం కలిగిన పార్టీల మద్దతుతో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో చౌదరి చరణ్ సింగ్ 14 జనవరి 1980న రాజీనామా చేశారు.

చంద్రశేఖర్
మొదటిసారి ఎమర్జెన్సీ తర్వాత అయితే.. రెండవ సారి ఇందిరా హత్య అనంతరం చంద్రశేఖర్‭కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి 1986, అక్టోబర్ 31న ప్రధానిని చేసింది. ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 400 సీట్లతో భారీ మెజారిటీ సాధించింది. దీంతో రాజీవ్ రాజీవ్ గాంధీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదు. కానీ అది అతిపెద్ద పార్టీగా కాంగ్రేసే అవతరించింది. ఆ సమయంలో బీజేపీ, వామపక్షాల మద్దతుతో జనతాదళ్‌కు చెందిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధాని అయ్యారు.

ఆ సమయంలో బాబ్రీ మసీదు సమస్యపై రథయాత్ర చేస్తున్న ఎల్‌కే అద్వానీని బీహార్‌లో ముఖ్యమంత్రి లాలూ యాదవ్ అరెస్టు చేశారు. దీంతో విశ్వనాథ్ ప్రతాస్ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకుంది, ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత జనతాదళ్‌కు చెందిన చంద్రశేఖర్ 64 మంది ఎంపీలతో పార్టీ నుంచి విడిపోయారు. కొత్తగా సమాజ్ వాదీ జనతా పార్టీని స్థాపించి కాంగ్రెస్ మద్దతుతో ప్రధానమంత్రి అయ్యారు. అయితే ఈసారి కూడా కాంగ్రెస్ గతంలో చేసినట్లే చేసింది. కేవలం మూడు నెలలకే మద్దతు ఉపసంహరించుకుంది. రాజీవ్ గాంధీపై గూఢచర్యం చేశారని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో చంద్రశేఖర్ 1991 మార్చి 6న రాజీనామా చేయాల్సి వచ్చింది.

హెచ్‌డి దేవెగౌడ
1996 సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే మెజారిటీ నిరూపించుకోలేక పోవడంతో కేవలం 13 రోజుల్లోనే వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయింది. ఆ సమయంలో కాంగ్రెస్‌కు 141 సీట్లు వచ్చాయి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే మద్దతు ఇచ్చి, ప్రభుత్వాన్ని పడగొట్టడంపై కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపింది. కాంగ్రెస్‌ మద్దతుతో జనతాదళ్ నేత హెచ్‌డీ దేవెగౌడ ప్రధాని అయ్యారు. కానీ సీతారాం కేసరి కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాగానే అకస్మాత్తుగా మద్దతు ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం పడిపోయింది.

దేవెగౌడ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడానికి కారణం.. కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి ప్రధాని కావాలని కోరుకున్నారు. ప్రభుత్వం పడిపోగానే కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి అనేక పార్టీలను ఢిల్లీకి పిలిచి చర్చలు చేసినప్పటికీ.. ఎవరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు.

ఇంద్ర కుమార్ గుజ్రాల్
1996-98 మధ్య ముగ్గురు ప్రధానులు ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయి, యునైటెడ్ ఫ్రంట్ యొక్క హెచ్‌డీ దేవెగౌడ, ఆ తర్వాత ఇందర్ కుమార్ గుజ్రాల్ మూడవ ప్రధాని అయ్యారు. ఆ సమయంలో ప్రధానమంత్రి పదవి రేసులో చాలా మంది అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నప్పటికీ వారి సొంత వ్యక్తుల కుట్రల్లో బాధితులయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌లో జన్మించిన ఇందర్ కుమార్ గుజ్రాల్‌కు ప్రధాని అవకాశం లభించింది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ప్రధానమంత్రి పదవికి తన పేరు ఖరారు అయినప్పుడు ఆయన నిద్రపోతుండడం అత్యంత ఆసక్తికరమైన విషయం.

దేవెగౌడ ప్రభుత్వం పడిపోయిన తర్వాత సీతారాం కేసరి ప్రధానమంత్రి కావాలనుకున్నారు. కానీ సొంత పార్టీ నేతలే ఆయనకు మద్దతు ఇవ్వలేదు. ప్రణబ్‌ ముఖర్జీ, శరద్‌ పవార్‌, అర్జున్‌ సింగ్‌, జితేంద్ర ప్రసాద్‌ వంటి వారు వ్యతిరేకించారు. దాంతో యునైటెడ్ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వడం తప్ప కాంగ్రెస్‌కు వేరే మార్గం లేకుండా పోయింది. యునైటెడ్ ఫ్రంట్ లోనూ ప్రధానమంత్రి పదవి రేసులో పలువురు ప్రముఖులు ఉన్నప్పటికీ.. ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండడం వల్ల బలమైన నాయకుడికి ప్రధాని పదవి దక్కలేదు.

Supreme Court: ఢిల్లీ ఆర్డినెన్సు అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కీలక ఆదేశాలు

ఇంతలో ఇందర్ కుమార్ గుజ్రాల్‌ను ప్రధానిని చేయాలనే చర్చ మొదలైంది. ములాయం సింగ్ సహా చాలా మంది ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, సీతారం కేసరి మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇంద్ర కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రి అయిన కథ చాలా ప్రసిద్ధి చెందింది. ప్రధానమంత్రి పదవిపై రోజంతా జరిగిన చర్చలో ఏకాభిప్రాయం రాక గుజ్రాల్ మీటింగ్ నుంచి వెళ్లి పడుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడు ఆయనను నిద్ర నుంచి లేపి లేపి ఇప్పుడు నువ్వే ప్రధాని పదవి చేపట్టాలని చెప్పారట. ఇది విన్న గుజ్రాల్ సంతోషించి ఆయనను కౌగిలించుకున్నారట. ఈ విధంగా కాంగ్రెస్ మద్దతుతో గుజ్రాల్ 21 ఏప్రిల్ 1997న దేశ 12వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఈయన ప్రభుత్వం కూడా ఏడాది తిరక్క ముందే ముగిసింది.

Manipur Violence: మణిపూర్‌లో ఇంత జరుగుతున్నా రాష్ట్రపతి పాలన ఎందుకు విధించడం లేదు?

ఇలా నాలుగు సందర్భాల్లో బయటి వ్యక్తుల్ని కాంగ్రెస్ ప్రధానులుగా చేసింది. కానీ, ప్రధాని చేసిన కొద్ది రోజులకే ఏదో ఒక కారణం చెప్పి ఆ ప్రభుత్వాల్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీనే కూలదోసింది. ఇక 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఇలాగే జరిగింది. అప్పటికి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు. కాంగ్రెస్ కూడా ప్రధాని అభ్యర్థిపై మౌనంగా ఉంది. కానీ యూపీఏ ఏర్పాటు అనంతరం కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్‭ను ప్రధాని చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి యూపీఏ కూటమికి అధినేతగా సోనియా గాంధీ వ్యవహరించారు. వాస్తవానికి ప్రస్తుతం కాంగ్రెస్ అధినేతగా ఖర్గే ఉన్నప్పటికీ.. అధికారాలు ఇంకా గాంధీ కుటుంబం గుమ్మం లోపలే ఉన్నాయనే విమర్శలు గట్టిగానే ఉన్నాయి. పైగా రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ప్రధాని పదవిపై కాచుకొని ఉన్నారు. మరి ఈసారి కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి.