Manipur Violence: మణిపూర్‌లో ఇంత జరుగుతున్నా రాష్ట్రపతి పాలన ఎందుకు విధించడం లేదు?

చురచంద్‌పూర్, ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, విష్ణుపూర్‌లు మైతీ, కుకీ యుద్ధంలో హింసాత్మకంగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లో మెయిటీ వర్గానికి చాలా ఆధిపత్యం ఉంది. 2022 ఎన్నికల్లో ఈ ప్రాంతాల నుంచి బీజేపీకి 24 సీట్లు వచ్చాయి

Manipur Violence: మణిపూర్‌లో ఇంత జరుగుతున్నా రాష్ట్రపతి పాలన ఎందుకు విధించడం లేదు?

Presidential Rule in Manipur: మణిపూర్‌లో మైతీ-కుకి తెగల మధ్య హింసాత్మక పోరాటం నేపథ్యంలో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఈడ్చుకెళుతున్న వీడియో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ వీడియో వైరల్ కావడంతో మణిపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. అప్పుడెప్పుడో మే 4వ తేదీన జరిగిన ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Traffic Jam in Telangana : తెలంగాణలో భారీ వర్షాలు .. వాహనదారుల కష్టాలు

మే 3న మణిపూర్‌లో ప్రారంభంమైన హింసలో ఇప్పటివరకు 120 మందికి పైగా మరణించారు. 50 వేల మందికి పైగా గాయపడ్డారు. హింసను అరికట్టేందుకు ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ.. పరిస్థితులు ఏమాత్రం అదుపులోకి రాలేదు. సరికదా మరింత దిగజారాయి. రాష్ట్రంలో సైన్యాన్ని మోహరించి, కనిపిస్తే కాల్చేస్తామనే ఆదేశాలు ఇచ్చిప్పటికీ, మణిపూర్‌లో జరిగిన హింస అదుపులోకి రాలేదు. మణిపూర్‌లో పోలీసులు-పరిపాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని గిరిజన సంస్థ తిప్రా మోతా అధినేత ప్రద్యుత్ దేవ్ బర్మన్ అన్నారు. అడ్మినిస్ట్రేషన్ ప్రోద్బలంతోనే అన్ని చెడు పనులూ జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

పరిస్థితిని అదుపు చేయలేకపోవడంపై కేంద్రంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి మరిన్ని ఆధారాలను గురువారం రాజధాని ఇంఫాల్‌లో ప్రజల ముందు ఉంచుతామని గిరిజన సంస్థలు వెల్లడించాయి. సాక్ష్యాలు, చర్యలు, హింస మధ్య మణిపూర్‌లో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతుందనేది ప్రస్తుతం పెద్ద ఎత్తున్న విపినిస్తున్న అతి పెద్ద ప్రశ్న?

MANIPUR: ఈ ఒకే ఒక్క వదంతు వల్ల.. ఆ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు.. ఇప్పుడు యావత్ భారత్ రగిలిపోతోంది..

మణిపూర్ హింసాకాండ, తాజాగా వచ్చిన వీడియోపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు. మణిపూర్ హింసాకాండ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైతే, తాము జోక్యం చేసుకుంటామని హెచ్చరించింది. హింసాకాండలో మహిళలను సాధనంగా ఉపయోగించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని కేంద్రం, రాష్ట్రానికి నోటీసులు జారీ చేశారు. అయితే మణిపూర్ వీడియోపై ప్రధాని కూడా మౌనం వీడారు. పార్లమెంట్ వెలుపల గురువారం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ఘటన దేశాన్ని తలదించుకునేలా ఉందన్నారు. 140 కోట్ల మందిని అవమానించారని, ఏ కేసులోనైనా దోషులుగా ఉన్న వారిని వదిలిపెట్టమని మోదీ స్పష్టం చేశారు.

హింస ప్రారంభమైనప్పుడే మణిపూర్‭లో 40 వేల మంది ఆర్మీ, సెంట్రల్ ఫోర్స్ సైనికులను మోహరించారు. హింసను నిరోధించేందుకు పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ ద్వారా కూడా కేంద్ర బలగాల సిబ్బంది కొండ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సైనికులకు షూట్ అండ్ సైట్ (చూడగానే కాల్చడం) ఆర్డర్ కూడా వచ్చింది. ఈ హింసపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే మూడు రివ్యూ మీటింగులు నిర్వహించారు. మే 29న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్‌తో అమిత్ షా తన మొదటి సమావేశాన్ని నిర్వహించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో కోరారు.

Manipur Violence: మణిపూర్ దారుణ వీడియో ఘటన.. ఎట్టకేలకు కీలక నిందితుడి అరెస్ట్

జూన్ 24న రెండవ సమావేశం, జూన్ 26న మూడవ సమావేశం నిర్వహించారు. రెండవ సమావేశంలో అన్ని పార్టీల నేతలను పిలిపించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మూడవ సమావేశంలో పూర్తి నివేదికను ప్రధానికి అమిత్ షా సమర్పించారు. అనంతరం, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ మార్చారు. మే 8న రాజేష్ కుమార్ స్థానంలో మణిపూర్ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి వినీత్ జోషి నియమితులయ్యారు. ఇద్దరు అధికారుల మోహరింపులో కేంద్రం కీలక పాత్ర పోషించింది. దీంతో పాటు 40 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం మణిపూర్‌కు పంపింది.

రాష్ట్రపతి పాలన హింసను నివారిస్తుందా?
హింసను అరికట్టేందుకు రాష్ట్రపతి పాలన విధించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హింసను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మణిపూర్‌లో పరిస్థితి దారుణంగా మారడానికి ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ కారణమని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హింసాత్మక ఘటనలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా, కేంద్ర ప్రభుత్వ కట్టుబాట్లు కొరవడుతున్నాయి. ఇది సరిగ్గా జరిగితే, హింస సులభంగా ఆగిపోతుందని కొన్ని అభిప్రాయాలు వస్తున్నాయి.

Manipur Violence: పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ ప్రకంపనలు.. వాయిదా తీర్మానాలు ఇచ్చిన విపక్షాలు

రాష్ట్రాలలో పరిస్థితిని సాధారణీకరించడానికి కేంద్రానికి అనేక హక్కులు కూడా ఉన్నాయి. కేంద్రం సిఫారసు మేరకు రాష్ట్రపతి ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. సుప్రీంకోర్టు న్యాయవాది ధ్రువ్ గుప్తా ప్రకారం, రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం ఆధారంగా భారత రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చని ఆర్టికల్ 356లో పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వాన్ని కొనసాగించడం లేదని రాష్ట్రపతి భావించాల్సి ఉంటుంది.

మణిపూర్‌లో జరుగుతున్న హింసకు నైతిక బాధ్యత వహిస్తూ జూన్ 30న ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆయన మద్దతుదారులు ఆయన నివాసం వెలుపల రాజీనామా లేఖను చించివేశారు. దీనిపై బీరేన్ సింగ్ కూడా మౌనం వహించారు. మణిపూర్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేయడం ద్వారా రాష్ట్రపతి పాలనను అమలు చేయడంలో అనేక సమస్యలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉంది. 2022 మణిపూర్ ఎన్నికల్లో బీజేపీ డబుల్ ఇంజిన్ నినాదాన్ని ఇచ్చింది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ స్వయంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Manipur Violence: మీరు చర్యలు తీసుకోకుంటే మేం రంగంలోకి దిగుతాం.. మణిపూర్ దారుణంపై కేంద్రానికి సుప్రీకోర్టు వార్నింగ్

హింస జరిగినప్పటి నుంచి హోం మంత్రిత్వ శాఖ కూడా చురుకుగా పని చేస్తోంది. సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించడం వల్ల హింస ఆగుతుందని చెప్పలేం. చురచంద్‌పూర్, ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, విష్ణుపూర్‌లు మైతీ, కుకీ యుద్ధంలో హింసాత్మకంగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లో మెయిటీ వర్గానికి చాలా ఆధిపత్యం ఉంది. 2022 ఎన్నికల్లో ఈ ప్రాంతాల నుంచి బీజేపీకి 24 సీట్లు వచ్చాయి. మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తం 31 సీట్లు అవసరం. మణిపూర్‌లో మైతీ ప్రభావిత సీట్ల సంఖ్య దాదాపు 40 వరకు ఉంటాయి.

మణిపూర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎంవీ మురళీధరన్‌తో కూడిన ధర్మాసనం మార్చి 27న మైతీ, కుకీల మధ్య పోరు ఏమిటనే అంశంపై తీర్పునిచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మైతీ వర్గాన్ని కూడా ఎస్టీ కేటగిరీలో చేర్చాలని కోరారు. హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వు చట్టవిరుద్ధమని కుకీ సంఘం పేర్కొంది. మణిపూర్‌లో ప్రధానంగా మైతీ, కుకి, నాగ కులాలు నివసిస్తున్నాయి. నాగా, కుకి ఇప్పటికే గిరిజన హోదాను కలిగి ఉన్నాయి. కానీ 1949లో ఈ హోదా నుంచి మైతీలను తొలగించారు. అప్పటి నుంచి మైతీ వర్గం ప్రజలు తమకు గిరిజన హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది.

Asaduddin Owaisi: మణిపూర్‌ ఘటనపై ఇన్నాళ్లు మౌనం.. ఇప్పుడు అందుకే మోదీ స్పందించారు: అసదుద్దీన్

మైతీ గిరిజనుల రిజర్వేషన్లు సాధిస్తే తమను దోచుకుతింటారని కుకి గిరిజనులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మైతీ వర్గం స్థిరపడేందుకు వీలు లేదు. ఇదే నిరసనకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బలంగా ఉన్న మైతీ వర్గం ప్రజలు తమ పర్వతాలను కూడా ఆక్రమిస్తారని కుకీ కమ్యూనిటీ ప్రజలు భావిస్తున్నారు.