MANIPUR: ఈ ఒకే ఒక్క వదంతి వల్ల.. ఆ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు.. ఇప్పుడు యావత్ భారత్ రగిలిపోతోంది..

మణిపూర్‌లో మే 3న హింస చోటుచేసుకోవడంతో ఆ ఇద్దరు బాధిత మహిళలు (కుకీ-జోమీ తెగకు చెందిన వారు) తమ కుటుంబ సభ్యులతో కలిసి అటవీ ప్రాంతంలోకి పారిపోయి తలదాచుకున్నారు.

MANIPUR: ఈ ఒకే ఒక్క వదంతి వల్ల.. ఆ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు.. ఇప్పుడు యావత్ భారత్ రగిలిపోతోంది..

MANIPUR – Women Video: మణిపూర్ రెండు నెలలుగా తగలబడిపోతోంది. అయినప్పటికీ ఇప్పటికీ పరిష్కారం లేదు. అక్కడి ప్రజలు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. మహిళలు మాన, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని తెలుస్తోంది.

మెయితీ, కుకీ తెగల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రతరమయ్యాయి. మానవత్వానికే మచ్చ తెచ్చేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇద్దరు మహిళలను హింసిస్తూ నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్ భారతాన్ని కలచివేస్తోంది. అసలు వారిపై ఎందుకు ఇంత ఘోరంగా దాడి చేశారు? రెండు నెలల క్రితం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది? వీరిద్దరిని నగ్నంగా ఊరేగించడానికి మరో ఫేక్ వీడియోనే కారణం.

వివాదం ఇలా మొదలై.. మరో మలుపు..
క్రైస్తవ మతాన్ని పాటించే కుకి వర్గం షెడ్యూల్డ్ తెగల్లో ఉంది. కుకి ప్రాంతాల్లో మెయితీ భూములు కొనే వీలులేదు. గిరిజనులు, గిరిజనేతరులుగా వారు కొనసాగుతున్నారు. రక్షిత, రిజర్వుడు అటవీ ప్రాంతాలుగా గిరిజనులు నివసిించే భూములను ప్రభుత్వం గుర్తించింది. దీంతో తమను షెడ్యూల్ తెగలో చేర్చాలని మెయితీ డిమాండ్ చేస్తున్నారు. మెయితీ డిమాండుకు వ్యతిరేకంగా కుకి వర్గం ఆందోళనలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం గొడవలు మొదలయ్యాయి.

ఘర్షణలు షురూ..

అది మే 3వ తేదీ.. ఈ రోజున మెయితీ, కుకిలను మధ్య ఘర్షణను ప్రారంభమైన రోజు. పరస్పరం దాడులకు దిగారు. ఆ మరుసటి రోజే (మే 4న) ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఆ మహిళలు ఇద్దరు కుకీ-జోమీ తెగకు చెందినవారు. ఆ మహిళలపై అఘాయిత్యానికి పాల్పడింది మెయితీ ఆధిపత్యం ఉండే తౌబల్ జిల్లాలో అని తెలుస్తోంది.

ఈ విషయం అప్పటి నుంచి ఇప్పటివరకు బయటకు రాలేదు. దీనిపై మే 18న కాంగ్‌ పోక్పి జిల్లాలో పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. వీడియోలో కనపడిన ఆ ఇద్దరు బాధిత మహిళల్లో ఒకరికి 20 ఏళ్లు, మరొక మహిళకు 40 ఏళ్ల వయసని జాతీయ వార్తా పత్రికలు పేర్కొంటున్నాయి. ఓ యువతిని దారుణంగా అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యువతిని కాపాడేందుకు ఆమె సోదరుడు ప్రయత్నించాడు. అతడి వయసు 19 ఏళ్లు. అతడిని నిందితులు హత్య చేశారు.

వదంతులే కారణం..
మణిపూర్‌లో మే 3న హింస చోటుచేసుకోవడంతో ఆ ఇద్దరు బాధిత మహిళలు (కుకీ-జోమీ తెగకు చెందిన వారు) తమ కుటుంబ సభ్యులతో కలిసి అటవీ ప్రాంతంలోకి పారిపోయి తలదాచుకున్నారు. అదే సమయంలో వారి ప్రత్యర్థి వర్గం మెయితీ ఓ వదంతి వ్యాపించింది.

మెయితీ తెగకు చెందిన మహిళలపై అత్యాచారం జరిగిందని వదంతి ప్రచారం జరిగింది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని మెయితీ ఎదురుచూస్తున్నారు. మే 4న కుకీ తెగవారి కోసం వెతుకుతూ ఓ గ్రామంపై దాడికి వెళ్లారు. ఆ సమయంలోనే కుకీ తెగకు చెందిన ఆ ఇద్దరు బాధిత మహిళలు ప్రత్యర్థి గ్రూపు కంటపడ్డారు.

కుకీ తెగకు చెందిన ఇద్దరు బాధిత మహిళలతో పాటు కలిసి అటవీ ప్రాంతంలో మరో ముగ్గురు (మొత్తం అయిదుగురు) వారి బంధువులు తలదాచుకుంటున్నారు. వారిలో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. వారిలోని ఇద్దరు మహిళలను పట్టుకుని హింసిస్తూ, నగ్నంగా ఊరేగించారు.

Asaduddin Owaisi: మణిపూర్‌ ఘటనపై ఇన్నాళ్లు మౌనం.. ఇప్పుడు అందుకే మోదీ స్పందించారు: అసదుద్దీన్

అనంతరం బాధిత మహిళల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరిపై సామూహిక అత్యాచారం జరిగిందని కూడా పేర్కొన్నారు. మే4న తీసిన వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతూ భారతావనిని కదిలిస్తోంది. మణిపూర్ లో మే 3 నుంచి ఇంటర్నెట్ ను తాత్కాలికంగా నిషేధించారు. అప్పటి నుంచి బయటకు రాని వీడియో గురువారం ఒక్కసారిగా బయటకు వచ్చిన వెంటనే విపరీతంగా వైరల్ అయింది.

Manipur Violence: మణిపూర్‌లో ఏం జరుగుతోంది?