corn flakes : మధుమేహులు కార్న్ ఫ్లేక్స్ తినటం మంచిదేనా?.

ఎక్కువ చక్కెరతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహారాలు అధిక గ్లైసెమిక్ ఫుడ్ కేటగిరీ కిందకు వస్తాయి. అదేకోవకు చెందిన కార్న్ ఫ్లెక్స్ తీసుకోవటం ద్వారా మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

corn flakes : మధుమేహులు కార్న్ ఫ్లేక్స్ తినటం మంచిదేనా?.

Cornflakes (1)

corn flakes : ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే కనీసం తీసుకునే ఆహారం విషయంలో కూడా మనిషి సరైన శ్రద్ధ చూపించలేకపోతున్నాడు. ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ కూడా త్వరగా తయారు చేసుకోవాలన్న తపనతో క్షణాల్లో సిద్ధమయ్యే బ్రేక్ ఫాస్ట్ లపై ఎక్కవగా దృష్టిపెడుతున్నారు. అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లలో కార్న్ ఫ్లేక్స్ కూడా ఒకటి. అయితే కార్న్ ఫ్లేక్స్ తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదేనా…మధుమేహంతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోవచ్చా అన్న విషయంపై అనేక మందిలో సందేహాలు కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించిన అనేక విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….

కార్న్‌ఫ్లేక్స్‌లో మూల పదార్ధం మొక్కజొన్న దీంతోపాటు చక్కెర, మాల్ట్ ఫ్లేవర్, అధిక ఫ్రక్టోజ్ వంటివి కార్న్ ఫ్లేక్స్ లో ఉండే పదార్ధాలు. వీటిలో ఎక్కువ భాగం గ్లైసెమిక్ ఇండెక్స్ అధిక కంటెంట్‌ను కలిగి ఉంటాయి. దీని మూలంగా పోషకాహార నిపుణులు ఆరోగ్యానికి కార్న్ ఫ్లేక్స్ తీసుకోవటం మంచిదన్న అభిప్రాయాన్ని ఏమాత్రం వ్యక్తం చేయటంలేదు. అలాగే, 1 కప్పు కార్న్ ఫ్లేక్స్‌లో 1.7 గ్రాములు ప్రొటీన్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఉండే తక్కువ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంచదు. అదే క్రమంలో ఇందులో ఉండే చక్కెర కంటెంట్ కొవ్వు నిల్వలు పెరిగేలా చేస్తుంది.

ఎక్కువ చక్కెరతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహారాలు అధిక గ్లైసెమిక్ ఫుడ్ కేటగిరీ కిందకు వస్తాయి. అదేకోవకు చెందిన కార్న్ ఫ్లెక్స్ తీసుకోవటం ద్వారా మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కార్న్ ఫ్లేక్స్ యొక్క గ్లైసెమిక్ సూచిక చాలా ఎక్కువగా ఉంటుంది, ఇందులో 82ఐఈ గ్లైసెమిక్ ఇండిక్స్ కార్బోహైడ్రేట్ యొక్క అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇది టైప్ 2 మధుమేహం ప్రమాదానికి దోహదం చేస్తుంది. కాబట్టి కార్నఫ్లెక్స్ మధుమేహం, గుండె సమస్యలు, ఊబకాయంతో ముడిపడి ఉన్న ఇతర వ్యాధుల వంటి అనేక ఆరోగ్య సమస్యలను అవి తీవ్రతరం చేస్తాయి.

కాబట్టి అధిక బరువు, డయాబెటిస్, దంతక్షయం, గుండె సమస్యలకు కారణమయ్యే కార్న్ ఫ్లెక్స్ని ఆహారంగా తీసుకోక పోవటమే మంచిదని వైద్యులు చూసిస్తున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా, ఉదయం అల్పాహారంగా గోధుమ రవ్వ ఉప్మా, ఓట్స్ వంటి వాటిని ఎంపిక చేసుకోవాలి. లేదంటే బెర్రీలు, యాపిల్స్,అరటిపండ్లు వంటి పండ్లను తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కోసం కొన్ని గింజలను తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.