Watermelons : పుచ్చకాయలు అతిగా తింటే అనర్ధమే?

పుచ్చకాయలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో నీటి స్థాయి పెరుగుతుంది. శరీరంలో చేరిన అదనపు నీరు విసర్జించబడకపోతే, అది రక్తం పరిమాణంలో పెరుగుదలకు దారితీస్తుంది.

Watermelons : పుచ్చకాయలు అతిగా తింటే అనర్ధమే?

Watermelons

Watermelons : వేసవి కాలంలో పుచ్చకాయలు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. వీటిని తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలు వేసవిలో బాగా తోడ్పడతాయి. పుచ్చకాయలో లైకోపీన్ అని పిలిచే ఫైటో కెమికల్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపటంలో సహాయపడుతుంది. కండరాల నొప్పులను తగ్గించటంలో సైతం ఇద సహాయపడుతుంది. అయితే పుచ్చకాయలను మోతాదుకి మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పుచ్చకాయలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో నీటి స్థాయి పెరుగుతుంది. శరీరంలో చేరిన అదనపు నీరు విసర్జించబడకపోతే, అది రక్తం పరిమాణంలో పెరుగుదలకు దారితీస్తుంది. ఫలితంగా కాళ్ళలో వాపు, అలసట, మూత్రపిండాలు బలహీనం కావడం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం స్థాయిలను కోల్పోయేందుకు అవకాశం ఉంటుంది. 100 గ్రాముల పుచ్చకాయలో దాదాపు 30 కేలరీలు ఉంటాయి. దీని ద్వారా 150 కేలరీలు శరీరానికి అందుతాయి. ఇందులో చక్కెర కూడా ఉంటుంది. తగిన మోతాదులో మాత్రమే పుచ్చకాయ తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పుచ్చకాయ అధిక మోతాదులో తినటం వల్ల శరీరంలో పొటాషియం స్ధాయిలు పెరుగుతాయి. పోటాషియం పెరగటం మూత్రపిండాలకు, కండరాలకు హాని కలుగుతుంది. గుండె పనితీరులో ఇబ్బందులు ఏర్పడతాయి. పుచ్చకాయ అతిగా తినటం కొన్ని సార్లు ప్రాణాంతకం కావచ్చు.
పుచ్చకాయ కొంతమందిలో అలర్జీ కలిగిస్తుంది.