Bigg Boss 5 Telugu: ఈ సీజన్ పులిహోర రాజా ‘సన్నీ’నేనా?

బిగ్ బాస్ సందడి మొదలైంది. నిన్నటి వరకు కంటెస్టెంట్లు ఎవరా అనే అనుమానాల ప్రచారం నుండి ఇప్పుడు కంటెస్టెంట్లు ఎవరో ఉత్కంఠ వీడి అందరినీ ఇంట్లోకి పంపేసి గొళ్ళెం పెట్టేశారు.

Bigg Boss 5 Telugu: ఈ సీజన్ పులిహోర రాజా ‘సన్నీ’నేనా?

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సందడి మొదలైంది. నిన్నటి వరకు కంటెస్టెంట్లు ఎవరా అనే అనుమానాల ప్రచారం నుండి ఇప్పుడు కంటెస్టెంట్లు ఎవరో ఉత్కంఠ వీడి అందరినీ ఇంట్లోకి పంపేసి గొళ్ళెం పెట్టేశారు. ఇక ఆట మొదలైంది. హోస్ట్ నాగ్ కూడా ఆటను మరింత రక్తి కటించేలా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లను ఆడించనున్నారు. మొత్తంగా సందడి మొదలవడంతో ఇప్పుడు కంటెస్టెంట్ల బలాలు, బలహీనతలపై సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. కాగా, ప్రతి ఏడాది హౌస్ లో ఒకరిద్దరు పులిహోర రాజాలు కనిపిస్తారు.

పులిహోర రాజాలు అంటే హౌస్ లో లేడీ కంటెస్టెంట్లతో ముచ్చట్ల నుండి రాసుకుపూసుకు తిరుగుతూ వాళ్ళని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిచే వాళ్ళన్నమాట. గత సీజన్లో అఖిల్, మోనాల్, పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ ఇలా ఈ పులిహోర కలిపే హైలెట్ అయ్యారు. మరి ఈ సీజన్ లో ఇలా ఎవరు అవుతారని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుండగా వీజే సన్నీ ఇప్పటికీ ఆ పులిహోర యాపారం మొదలు పెట్టాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే సన్నీ హౌస్ లో అడుగు పెట్టిన పదినిమిషాలలోనే లేడీ కంటెస్టెంట్లలో మాటలు కలిపేశాడు.

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu

బుల్లితెర మీద పాపులర్ నటుడిగానే పేరున్న సన్నీ రెండో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటర్ కాగా.. అంతకు ముందే హౌస్ లోకి వచ్చిన సిరితో మాట కలిపేశాడు. అంతేకాదు మూడవ కంటెస్టెంట్ గా వచ్చిన లహరితో కూడా ముచ్చట్లు పెట్టేశాడు. ముఖ్యంగా లహరిని ఫ్లర్ట్ చేసే ప్లాన్స్ అప్పుడే మొదలు పెట్టేశాడు. దీంతో సన్నీనే ఈ సీజన్ పులిహోర రాజా అవుతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎలాగు రవి, విశ్వ కూడా ఉండగా.. షో ముందుకెళ్లే కొద్దీ వీళ్ళు కూడా కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉంది. మరి ఎలా జరుగుతుందో.. బిగ్ బాస్ ఎలా నడిపిస్తాడో చూడాలి మరి!