GSLV NVS-1: నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ–ఎఫ్‌12

రాకెట్ బయల్దేరిన 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కిలోమీటర్ల ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్‭ఫర్ ఆర్బిట్‭లో ప్రవేశపెడుతుంది. స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో 2,232 కిలోల ఎన్‌వీఎస్‌–01 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది.

GSLV NVS-1: నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ–ఎఫ్‌12

ISRO: జీఎస్‌ఎల్వీ–ఎఫ్‌12 రాకెట్ సోమవారం నింగిలోకి దూసుకుపోయింది. స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో చేపడుతున్న ప్రయోగానికి తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వేదికైంది. ఈ రాకెట్‌ ద్వారా ఎన్‌వీఎస్‌–01 ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ముందుగా నిర్ణయించినట్లుగానే ఉదయం 10:42 గంటలకు ఈ ప్రయోగం చేపట్టింది ఇస్రో. కౌంట్‭డౌన్ నిర్వహించే ప్రక్రియ ఆదివారం ఉదయమే ప్రారంభమైంది. 27.30 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

Delhi Highcourt: రూ.2,000 నోట్ల మార్పిడికి ఐడి ప్రూఫ్ తప్పనిసరిపై కీలక తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు

ఈ రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు ఉంటుందని ఇస్రో తెలిపింది. రాకెట్ బయల్దేరిన 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కిలోమీటర్ల ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్‭ఫర్ ఆర్బిట్‭లో ప్రవేశపెడుతుంది. స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో 2,232 కిలోల ఎన్‌వీఎస్‌–01 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. ఇది విజయవంతమైతే ఈ శాటిలైట్‌ 12 ఏళ్లపాటు సేవలందించనుంది. దేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌–01 మొదటిది. ఈ ఉపగ్రహం ఇండియా భూభాగం చుట్టూ 1,500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైం పొజిషనింగ్ సేవలను అందిస్తుంది.