James Camaron : రాజమౌళి సినిమా నన్ను ఇండియన్ సినిమా గురించి ఆలోచించేలా చేసింది.. జేమ్స్ కామెరూన్ వ్యాఖ్యలు

జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. నా టైటానిక్ సినిమా భారతదేశంలో అంత గ్రాండ్ గా రిలీజ్ అవ్వలేదు. నేను 2010 లో మొదటిసారి భారత్ కు వెళ్ళాను. అప్పట్నుంచే ఇండియన్ సినిమాల గురించి, ఇండియన్ సినీ పరిశ్రమ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అవతార్ సినిమాలతో నా సినిమాలకు......................

James Camaron : రాజమౌళి సినిమా నన్ను ఇండియన్ సినిమా గురించి ఆలోచించేలా చేసింది.. జేమ్స్ కామెరూన్ వ్యాఖ్యలు

James Camaron comments on Indian cinema and Rajamouli in Titanic Re Release Pressmeet

James Camaron :  హాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరు అయిన జేమ్స్ కామెరూన్ ఆయన సినిమాలతో ఇండియాలో కూడా అభిమానులని సంపాదించుకున్నాడు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా ఇండియాలో కూడా భారీ విజయం సాధించి కోట్లు కుమ్మరించింది. ఇక మన దర్శకధీరుడు రాజమౌళి ఓ హాలీవుడ్ అవార్డు ఈవెంట్ లో జేమ్స్ కామెరూన్ ని కలవడం, కామెరూన్ రాజమౌళిని, RRR సినిమాని అభినందించడం తెలిసిందే.

తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా జేమ్స్ కామెరూన్ తీసిన అద్భుత కావ్యం టైటానిక్ సినిమా 25 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. టైటానిక్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా జేమ్స్ కామెరూన్ తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఈ ప్రెస్ మీట్ లో అనేక అంశాలు మాట్లాడటంతో పాటు రాజమౌళి, ఇండియన్ సినిమా గురించి కూడా ప్రస్తావించారు.

Formula E Race : సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో హోరెత్తిన ఫార్ములా ఈ-రేస్..

జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. నా టైటానిక్ సినిమా భారతదేశంలో అంత గ్రాండ్ గా రిలీజ్ అవ్వలేదు. నేను 2010 లో మొదటిసారి భారత్ కు వెళ్ళాను. అప్పట్నుంచే ఇండియన్ సినిమాల గురించి, ఇండియన్ సినీ పరిశ్రమ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అవతార్ సినిమాలతో నా సినిమాలకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉందని గ్రహించాను. ఇండియన్ సినిమాలకి, నా సినిమాలకి మధ్య ఏదైనా తేడా ఉందంటే అది పాటలు, డ్యాన్సులు మాత్రమే. ఇటీవల రాజమౌళిని కలిశాను. అతను తెరకెక్కించిన RRR సినిమా చూశాక అందులోని అన్ని అంశాలు నన్ను ఆలోచించేలా అచ్చేశాయి. ఈ సినిమా నన్ను భారతదేశ సినిమా గురించి పెద్దగా ఆలోచించేలా చేసింది. ఈ సినిమా వల్ల నేను భారతీయ సినిమాలని ఆస్వాదిస్తున్నాను అంటూ తెలిపారు. జేమ్స్ కామెరూన్ ఇలా ప్రెస్ తో మరోసారి రాజమౌళి, RRR సినిమాని అభినందించడంతో అభిమానులు, భారత సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.