Jeevitha Rajasekhar : నా కూతుళ్లపై ఇష్టమొచ్చిన థంబ్‌నెయిల్స్ పెట్టి రాస్తున్నారు.. నిహారిక, మోహన్‌బాబుపై కూడా ఇలాగే..

ప్రెస్ మీట్ లో జీవిత మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీని నేను ఒక ఫ్యామిలీ అనుకుంటాను. నేను కానీ, రాజశేఖర్ కానీ ఎవరికీ అన్యాయం చేయలేదు. మేం ఏదైనా ఓపెన్‌గా.............

Jeevitha Rajasekhar : నా కూతుళ్లపై ఇష్టమొచ్చిన థంబ్‌నెయిల్స్ పెట్టి రాస్తున్నారు.. నిహారిక, మోహన్‌బాబుపై కూడా ఇలాగే..

 

Jeevitha Rajasekhar :  జీవిత, రాజశేఖర్ లపై గరుడవేగ సినిమా నిర్మాతలు మోసం చేసారంటూ ఆరోపణలు చేసి పోలీస్ కేసులు పెట్టారు. గత రెండు రోజులుగా టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా నడుస్తుంది. గరుడవేగ సినిమా నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి జీవిత, రాజశేఖర్ పై పలు ఆరోపణలు చేశారు. వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే తాజాగా ఇవాళ జీవిత వీటిపై స్పందించింది.

అంతే కాకుండా ఇటీవల రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మికపై తప్పుడు వార్తలు రాసి ప్రచారం చేశారు. రాజశేఖర్ కూతురు ఎవరితోనో లేచిపోయిందంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేశాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు. గతంలోనే దీనిపై శివాత్మిక సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది. తాజాగా ఇవాళ్టి ప్రెస్ మీట్ లో జీవిత ఈ విషయం పై కూడా మాట్లాడింది. తమ కూతుళ్ల పైన తప్పుడు వార్తలు రాసిన వారిపై, ఇష్టమొచ్చినట్టు థంబ్ నెయిల్స్ పెట్టిన వారిపై ఫైర్ అయింది.

Bullet Song : చెన్నైలో రామ్, కృతి బుల్లెట్ సాంగ్ తమిళ్ వర్షన్ లాంచ్ ఈవెంట్

ఇవాళ్టి ప్రెస్ మీట్ లో జీవిత మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీని నేను ఒక ఫ్యామిలీ అనుకుంటాను. నేను కానీ, రాజశేఖర్ కానీ ఎవరికీ అన్యాయం చేయలేదు. మేం ఏదైనా ఓపెన్‌గా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. అది తప్పేం కాదు. ఆ విషయంలో నేను కాస్తైనా కంట్రోల్ చేసుకుంటా. కానీ మా ఆయన అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. దేవుడి దయ వల్ల నేను, మా ఆయన, నా పిల్లలు అందరం బాగానే ఉన్నాం. ఇటీవల మా అమ్మాయిల గురించి తప్పుడు వార్తలు రాశారు, ఇష్టమొచ్చినట్టు థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోలు పెట్టారు. చాలామంది నాకు ఫోన్లు చేసి మీ అమ్మాయిలు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్లకి యాక్టింగ్ అంటే ఇష్టం. వాళ్లపై ఇలాంటి వార్తలు రాయడం కరెక్ట్ కాదు. మా కూతుర్లపై అలాంటి వార్తలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ నుంచో ఫోన్లు వస్తాయి. మీకు ఇవన్నీ ఏమి తెలీదు. మీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. విషయం తెలియకుండా ఇలాంటి వార్తలు రాయడం వల్ల వాళ్ల కెరియర్ ఏమౌతుందో ఆలోచించండి. భవిష్యత్తులో మా పిల్లలు పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్తారు. వాళ్ల పరిస్థితి ఏం కావాలి. ఇలాంటివి చూసినప్పుడు చాలా హర్టింగ్‌గా ఉంటుంది.”

KGF 2 : విజయ్‌ని సొంత రాష్ట్రంలో దెబ్బ కొట్టిన యశ్..

”మొన్న నిహారిక విషయంలో కూడా నాకు చాలా బాధ కలిగింది. ఆమె అక్కడ కనిపించొచ్చు. కానీ దాన్ని అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. నిహారిక అక్కడ కనిపించినంత మాత్రాన ఇష్టం వచ్చిన హెడ్డింగ్ పెట్టి రాయాల్సిన అవసరం లేదు. ఇటీవల మోహన్ బాబు గారి ఫ్యామిలీపై కూడా ట్రోలింగ్ జరిగింది. ఇలాంటివి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. సెలబ్రిటీ అన్నంత మాత్రాన ఏది పడితే అది రాయొచ్చని అనుకుంటే తప్పు. దయచేసి ఏదైనా రాసే ముందు మా గురించి ఆలోచించండి. మమ్మల్ని అడిగి నిజానిజాలు తెలుసుకోండి” అంటూ సీరియస్ అవుతూనే రిక్వెస్ట్ గా చెప్పింది.