Reliance JIO: వొడాఫోన్ ఐడియాపై రిలయన్స్ జియో కంప్లైంట్

ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. వొడాఫోన్ ఐడియాపై కంప్లైంట్ చేసింది. కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్‌లను వెరిఫై చేయాలంటూ టెలికాం రెగ్యూలేటర్ ని కోరింది.

Reliance JIO: వొడాఫోన్ ఐడియాపై రిలయన్స్ జియో కంప్లైంట్

Vodafone Idea

Reliance JIO: ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. వొడాఫోన్ ఐడియాపై కంప్లైంట్ చేసింది. కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్‌లను వెరిఫై చేయాలంటూ టెలికాం రెగ్యూలేటర్ ని కోరింది. వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. పోర్ట్ అవుట్ అయ్యే కస్టమర్లకు అడ్డంకిగా మారిందని అన్నారు.

టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కు గతవారం పంపిన వినతిలో ఎస్ఎమ్ఎస్ సర్వీసును రూ.179 నుంచి రూ.149కి తగ్గించింది. ఇలా తగ్గించడం వల్ల పోర్ట్ అవుదామనుకుంటున్న కస్టమర్లను ఆపేయగలమనే ధీమాతో ఉన్నారు. ఇదే అంశంపై ఫిర్యాదు చేసిన జియో మరోసారి పరిశీలించాలంటూ పేర్కొంది.

సెప్టెంబర్ 2021లో 10.10 మిలియన్ మంది సబ్‌స్క్రైబర్లు మొబైల్ పోర్టబిలిటీ కోసం రిక్వెస్ట్ పెట్టుకోగా.. 638.25మిలియన్ పోర్టింగ్ రిక్వెస్టులుగా పెరిగాయి.

……………………………………………….: ట్విట్టర్ రూల్స్ మార్చేశారు.. ఆ పోస్టులకు చెక్

వొడాఫోన్ కస్టమర్లు గరిష్టంగా ఎస్ఎమ్ఎస్ సర్వీసుల భారంతోనే పోర్టింగ్ కు వెళ్తున్నారని.. వాటి ధరను తగ్గించింది. ఫలితంగా ఎమ్ఎన్పీలు తగ్గుతాయని భావించింది. ఫలితంగా తక్కువ టారిఫ్ ప్లాన్‌లు ఉన్న కస్టమర్లు పోర్ట్ అవుట్ చేయడానికి ఆసక్తి చూపించరు. ఖరీదైన ప్లాన్‌కు మారే వారు చెల్లించిన మొత్తం నుంచి కావాలనుకుంటే నిలిపివేయాలనుకోకపోవచ్చు.