Job Replacement : హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధులకు సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటన్ నైపుణ్యం ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.98 వేల వేతనం చెల్లించనున్నారు.

Job Replacement : హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉద్యోగాల భర్తీ

National Police Academy

Job Replacement : కేంద్ర హోం శాఖకు చెందిన హైదరాబాద్ లోని నేషన్ పోలీస్ అకాడమీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలన్నీ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకోనున్నారు.

ఖాళీల వివరాలకు సంబంధించి :

వెటర్నరీ ఆఫీసర్ విభాగంలో 1 ఖాళీ ఉంది. వెటర్నరీ సైన్స్, అనిమల్ హస్బండరీలో డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేసిన వారు సైతం అర్హులే.. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.98 వేల వేతనం చెల్లిస్తారు.

సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్ధులకు సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటన్ నైపుణ్యం ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.98 వేల వేతనం చెల్లించనున్నారు.

జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ విభాగంలో 1 ఖాళీ ఉంది. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.75,658 వేతనం చెల్లిస్తారు.

ఎక్స్ రే టెక్నీషియన్ విభాగంలో 1 ఖాళీ ఉంది. ఇంటర్, రేడియాలజీలో డిప్లొమా చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వేతనం రూ.45,186.

ఫిజియోథెరపిస్ట్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. ఫిజియోథెరపీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. పనిలో అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.60,828 వేతనం చెల్లిస్తారు.

స్టాఫ్ నర్స్ విభాగంలో 1 ఖాళీ ఉంది. బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ చేసిన వారు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.75,838 చెల్లించనున్నారు.

జూనియర్ ప్రొజెక్షనిస్ట్ విభాగంలో 1 ఖాళీ ఉంది. సంబంధిత సబ్జెక్టులో ఇంటర్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా రూ.33 వేలు చెల్లిస్తారు.

కెమెరామెన్ విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి. ఫొటోగ్రఫీ,సినిమాటోగ్రఫిలో డిప్లొమా చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.51,032 వేతనం అందిస్తారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ పాసై, కంప్యూటర్ నైపుణ్యం ఉన్న వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.45,186 వేతనం చెల్లిస్తారు.

స్పోర్ట్స్ కోచ్ విభాగంలో 1 ఖాళీ ఉంది. అభ్యర్థులు ఎస్ ఎఐ లో కోచింగ్ డిప్లొమా చేసి ఉండాలి. ఇంగ్లిష్, హిందీలో సంభాషణ నైపుణ్యం ఉండాలి. వేతనం రూ.42 వేలు చెల్లిస్తారు.

అభ్యర్ధులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను మార్చి 14, 2022 తేదీలోగా the assistant director(esst.I), svp natinlo police academy, shivarampalli, hyderabad-500052, telangana అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది.