Jr. NTR : జూ. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల సర్వమత ప్రార్థనలు..

గతేడాది కూడా ఈ మహమ్మారి కారణంగానే ‘ఆర్ఆర్ఆర్’ లో తారక్ కొమరం భీం వీడియో రిలీజ్ చెయ్యలేకపోయారు.. ఇక తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలంటూ.. జూనియర్ అభిమానులు సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు..

Jr. NTR : జూ. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల సర్వమత ప్రార్థనలు..

Jr Ntr Ntr Fans Prayers For His Speed Recovery From Covid 19

Updated On : May 11, 2021 / 12:27 PM IST

Jr. NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోమవారం తాను కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే.. కరోనా పాజిటివ్‌గా కన్ఫమ్ కావడంతో కుటుంబ సభ్యులంతా కలిసి హోం ఐసోలేషన్‌లో ఉన్నామని, ఎవరూ ఆందోళన చెందొద్దు.. ఈమధ్య కాలంలో నన్ను కలిసిన వారు కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి అంటూ తారక్ ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ తనకు కోవిడ్ సోకిందని చెప్పినప్పటి నుండి అభిమానుల్లో ఆందోళన నెలకొంది.. ఎందుకంటే ఈ నెల 20వ తేది జూనియర్ పుట్టినరోజు.. ప్రస్తుతం యాక్ట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ క్యారెక్టర్‌కి సంబధించి మూవీ టీం ఓ అప్‌డేట్ ఇవ్వనున్నారు అని తెలిసి ఫ్యాన్స్ సంబరాలు జరపాలని ఏర్పాట్లు చేసుకుంటుండగా.. ఇంతలో ఈ  వార్త వినాల్సి రావడంతో తీవ్రనిరాశకు లోనయ్యారు.

గతేడాది కూడా ఈ మహమ్మారి కారణంగానే ‘ఆర్ఆర్ఆర్’ లో తారక్ కొమరం భీం వీడియో రిలీజ్ చెయ్యలేకపోయారు.. ఇక తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలంటూ.. జూనియర్ అభిమానులు సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. అభిమానులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పలు దేవాలయాల్లో తారక్ కోలుకోవాలంటూ ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నారు. ఇక సినీ వర్గాల వారు తారక్ త్వరగా రికవరీ కావాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.