KA Paul: కేటీఆర్ కనుసన్నల్లోనే దాడి: కేఏ పాల్

సిరిసిల్లలో తనపై దాడి చేయించింది ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లే అని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గూండాగిరి కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.

KA Paul: కేటీఆర్ కనుసన్నల్లోనే దాడి: కేఏ పాల్

Ka Paul

KA Paul: సిరిసిల్లలో తనపై దాడి చేయించింది ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లే అని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గూండాగిరి కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. సోమవారం సిరిసిల్లలో పర్యటిస్తుండగా, కేఏ పాల్‌పై ఒక వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంగళవారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కనుసన్నల్లోనే తనపై దాడి జరిగిందని, తెలంగాణ చరిత్రలో అది బ్లాక్ డే అన్నారు. ‘‘తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు పిలిస్తేనే అక్కడికి వెళ్లాను.

KA Paul: కేఏ పాల్‏పై దాడి.. రైతుల ఆందోళన..!

ఆ ప్రాంతంలో 150 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. సిరిసిల్ల వెళ్లిన మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత టిఆర్ఎస్ నేతలు వచ్చారు. వాళ్లలో కేటీఆర్ నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పొందిన ఒక వ్యక్తి నాపై దాడి చేశాడు. నేను రైతులను దూషించాను అంటున్నారు. అది అవాస్తవం. నేను ఎవ్వరినీ దూషించలేదు. నాపై జరిగిన దాడిని అన్ని కుల సంఘాలు, పార్టీలు ఖండించాయి. నేను ప్రత్యేక రాష్టం కావాలని కోరుకున్నా. నన్ను ఆంధ్ర వాడిని అంటున్నారు. మరి కేసీఆర్ ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకోవాలి. నా పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు. అన్నీ చారిటీల మీదే ఉన్నాయి. డీజీపీ మహేందర్ రెడ్డికి నిన్నటి నుంచి కాల్ చేస్తున్నా, ఇప్పటి వరకు స్పందించలేదు. డీజీపీ దగ్గరకు వెళ్లకుండా నన్ను ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు. నన్ను ఎంతకాలం నిర్బంధిస్తారు? నాపై తెలంగాణ వ్యతిరేకి ముద్ర వేస్తున్నారు.

Attack On KA Paul : కేఏ పాల్ పై దాడి

రైతులను కలవడం తప్పా? సిరిసిల్ల రైతులకు అండగా నిలవడం నేను చేసిన పొరపాటా? నాపై జరిగిన దాడి తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడి. పీకే (ప్రశాంత్ కిషోర్)తో నేను టచ్‌లో ఉన్నాను. అన్ని పార్టీలను కలపాలని కేసీఆర్ చెప్పారని పీకే నాతో చెప్పాడు. 150 దేశాలను వణికించి వచ్చాను. కేసీఆర్, కేటీఆర్‌లకు నేను భయపడేది లేదు. అవసరమైతే బహిరంగ చర్చకు నేను సిద్ధం. అన్ని పార్టీల సభలకు అనుమతులు ఇస్తున్నారు. మరి నాకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తాను. అలా ఇవ్వకపోతే నా పాస్‌పోర్ట్ సీజ్ చేయండి’’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.