K Viswanath : ఒక్కొక్కరిగా.. దివికేగిన సినిమా త్రయం.. బాలసుబ్రమణ్యం, సిరివెన్నెల, కె.విశ్వనాథ్..

కె.విశ్వనాథ్ సినిమాల్లో చాలావరకు పాటలు SP బాలసుబ్రహమణ్యం గారే పాడారు. చాలావరకు పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. వీరి ముగ్గురిదీ సినిమా త్రయం అనేవారు. వీరు ముగ్గురు కలిసి అనేక సినిమాలకి.................

K Viswanath : ఒక్కొక్కరిగా.. దివికేగిన సినిమా త్రయం.. బాలసుబ్రమణ్యం, సిరివెన్నెల, కె.విశ్వనాథ్..

K Viswanath and sirivennela seetharamasastri and Balasubrahmanyam friendship

K Viswanath :  తెలుగు సినీపరిశ్రమకు ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలని అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం రాత్రి ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ కి తరలిస్తుండగా కన్నుమూశారు. ఆయన మరణంతో మరోసారి టాలీవుడ్ విషాదంలో మునిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన సినిమాలని గుర్తు తెచ్చుకుంటున్నారు.

ఆయన సినిమాలతో పాటు సినిమాల్లోని పాటలు కూడా ప్రేక్షకుల మదిని తాకాయి. కె.విశ్వనాథ్ చాలా సినిమాలు హిట్ అవ్వడానికి సంగీతం, పాటలు ముఖ్య కారణం. ఆయన ప్రతి సినిమాలోనూ పాటలు ముఖ్య పాత్ర వహించేవి. ఆ పాటల కోసమే సినిమాని మళ్ళీ మళ్ళీ చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ పాటలు వింటూ ప్రేక్షకులు మైమరిపించిపోయారు. ఆ పాటల క్యాసెట్ల కోసం షాప్స్ దగ్గర జనాలు తోసుకొని, కొట్టుకున్నారు కూడా. ఆ పాటలు ఎన్నో ఇళ్లల్లో మోగేవి. ప్రతి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చేవి. మరి కె.విశ్వనాథ్ పాటల వెనుక ఉన్న ప్రాణాలు ఎవరివో తెలుసుకోవాలిగా..

కె.విశ్వనాథ్ సినిమాల్లో చాలావరకు పాటలు SP బాలసుబ్రహమణ్యం గారే పాడారు. చాలావరకు పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. వీరి ముగ్గురిదీ సినిమా త్రయం అనేవారు. వీరు ముగ్గురు కలిసి అనేక సినిమాలకి పనిచేశారు. సంగీత దర్శకుడు ఎవరైనా ఈ ముగ్గురు కలిస్తే ఇక ఆ పాటలు సూపర్ హిట్. సీతారామశాస్త్రి రాసిన పాటలని బాలు తన గాత్రంతో అమృతం నింపితే వాటికి అద్భుతమైన దృశ్య కల్పన ఇచ్చేవారు కె.విశ్వనాథ్. SP బాలు ఎప్పట్నుంచో సినీ పరిశ్రమలో ఉండి ఎన్నో పాటలు పాడారు. కె.విశ్వనాథ్ గారికి కూడా ఎన్నో సినిమాల్లో పాడారు. కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రిని లిరిక్ రైటర్ గా పరిచయం చేసింది కె.విశ్వనాథ్ గారే.

కె.విశ్వనాథ్ జననీ జన్మభూమి సినిమాలో మొదటగా ఒక పాటకి అవకాశం ఇచ్చారు. అనంతరం స్వాతిముత్యం సినిమాలో ఒక పాట రాయించారు. ఆ తర్వాత వేరే వాళ్ళకి రెండు సినిమాల్లో కొన్ని పాటలు రాసినా అంతగా గుర్తింపు రాలేదు. మళ్ళీ కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు సీతారామశాస్త్రి రాశారు. ఈ పాటలు అన్నీ బాలు గారే పాడారు.సిరివెన్నెల సాంగ్స్ అన్నీ అద్భుతంగా హిట్ అయ్యాయి. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. విధాత తలపున, ఈ గాలి ఈ నెల, ఆదిభిక్షు, చినుకు చినుకు.. ఈ పాటలన్నీ ఇప్పుడు విన్నా కూడా ఎంతో కొత్తగా ఉంటాయి. ఈ సినిమా, పాటలు పెద్ద హిట్ అవ్వడంతో సినిమా పేరు సిరివెన్నెలనే సీతారామశాస్త్రికి ఇంటిపేరుగా మారింది. అప్పట్నుంచి వీరి బంధం ముడిపడింది.

Shankarabharanam : శంకరాభరణం.. సినిమాలకు ఆభరణం.. దక్షిణాది రాష్ట్రాల్లో సంగీతాన్ని నిద్రలేపిన సాధనం..

కె.విశ్వనాథ్ గారి అన్ని సినిమాలకు సిరివెన్నెల పాటలు రాస్తే బాలు గారు పాటలు పాడేవారు. ఈ సినిమా త్రయం ప్రేక్షకులని తమ సంగీతంలో మునిగేలా చేసింది. కాని ఈ ముగ్గురూ ఇప్పుడు భువి వీడి దివికేగారు. SP బాలసుబ్రహ్మణ్య కరోనా సమయంలో 25 సెప్టెంబర్ 2020న ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఆయన మరణం తర్వాత సంవత్సరానికి 30 నవంబర్ 2021న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. వీరిద్దరూ మరణించాక మీడియాతో మాట్లాడుతూ నా రెండు భుజాలు పోయాయి అని వ్యాఖ్యానించారు కె.విశ్వనాథ్. ఇప్పుడు మరో సంవత్సరం తర్వాత కె.విశ్వనాథ్ 2 ఫిబ్రవరి 2023న కన్నుమూశారు. తరతరాలకు సరిపడా అద్భుతమైన సాహిత్యాన్ని, పాటలని, సినిమాలని మనకిచ్చి ముగ్గురూ ప్రశాంతంగా కన్నుమూశారు. ఈ లోకానికి దూరమైనా సినిమా అనే రూపంలో ఆ ముగ్గురూ మనతోనే ఉంటారు.