Kamal Haasan : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ముగ్గురు మెగాస్టార్లు ఒకేచోట..

విక్రమ్ సినిమాతో వచ్చి కమల్ హాసన్ భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో శనివారం నాడు హైదరాబాదులో,,,,,,,,,,,,,,,,,

Kamal Haasan : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ముగ్గురు మెగాస్టార్లు ఒకేచోట..

Kamal Hasan Chiranjeevi

Chiranjeevi :  ఇటీవల విక్రమ్ సినిమాతో వచ్చి కమల్ హాసన్ భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో శనివారం నాడు హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఆ తర్వాత విక్రమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు.

కమల్ హాసన్ చిరంజీవి ఇంటికి వెళ్లగా సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సన్మాన కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా వచ్చారు. అలాగే మెగా కుటుంబానికి చెందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ని కూడా చిరంజీవి సన్మానించారు.

Pratyusha Garimella : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల అనుమానాస్పద మృతి

ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేశారు. ఈ సన్మానం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు తన ట్విట్టర్ లో షేర్ చేసి.. ”నా చిరకాల మిత్రుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ సాధించినందుకు అభినందనలు. అలాగే ఈ కార్యక్రమంలో నా బ్రదర్ సల్మాన్ కూడా పాల్గొన్నారు. కమల్ ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది” అని ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి, కమల్ హాసన్ కలవడం, వీరికి తోడు సల్మాన్ ఖాన్ కూడా ఉండటంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.