NZ vs SL 2nd Test: న్యూజిలాండ్ బ్యాటర్ల విజృంభణ.. విలియమ్సన్, నికోల్స్ డబుల్ సెంచరీల మోత ..

న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్  బ్యాటర్లు రెచ్చిపోయారు. కివీస్ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ డబుల్ సెంచరీల మోతమోగించారు. దీంతో న్యూజిలాండ్ రెండో రోజు ఆటలో మొదటి ఇన్నింగ్స్ ను 580/4 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

NZ vs SL 2nd Test: న్యూజిలాండ్ బ్యాటర్ల విజృంభణ.. విలియమ్సన్, నికోల్స్ డబుల్ సెంచరీల మోత ..

NZ vs SL 2nd Test

NZ vs SL 2nd Test: న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్  బ్యాటర్లు రెచ్చిపోయారు. కివీస్ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ డబుల్ సెంచరీల మోతమోగించారు. దీంతో న్యూజిలాండ్ రెండో రోజు ఆటలో మొదటి ఇన్నింగ్స్ ను 580/4 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మూడో వికెట్‌కు విలియమ్స్, నికోల్స్ 363 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  రెండో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. వర్షం అంతరాయం కారణంగా తొలిరోజు ఆటలో కివీస్ 155-2 పరుగులు చేసింది. రెండోరోజు ఆటను ప్రారంభించిన విలియమ్స్, నికోల్స్ శ్రీలంక బౌలర్లను ఊచకోతకోశారు.

India enter WTC final-2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన టీమిండియా

విలియమ్సన్ 296 బంతుల్లో 215 పరుగులు చేశాడు. ఇందులో 23 ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. నికోల్స్ 240 బంతులు ఎదుర్కొని 200 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 15 ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి. నికోల్స్ 200 (నాటౌట్) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద న్యూజిలాండ్ 580\4 తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. విలియమ్సన్ 215 పరుగులు చేయడం ద్వారా ఆరో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. నికోల్స్ న్యూజిలాండ్ తరపున మొదటి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒకే టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు డబుల్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి.

ఇదిలాఉంటే విలియమ్సన్ తాజా డబుల్ సెంచరీతో టెస్టుల్లో 8వేల పరుగులు చేసిన మొదటి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. రెండోరోజు ఆట పూర్తయ్యే సరికి తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు రెండు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే(16), నైట్ వాచ్‌మెన్ ప్రబాత్ జయసూర్య (4) పరుగులతో క్రీజులో ఉన్నారు.