Kantara : కాంతార సినిమాకి అరుదైన గౌరవం.. ఐక్యరాజ్య సమితిలో రిషబ్ శెట్టి స్పీచ్..
గత ఏడాది కన్నడ పరిశ్రమలో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్టుగా నిలిచిన చిత్రం 'కాంతార'. ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేసింది. స్విట్జర్లాండ్ జెనీవాలో జరిగే ఐక్యరాజ్య సమితిలో కాంతార సినిమాని ప్రదర్శించే అరుదైన గౌరవం లభించింది.

Kantara is screened at united nations and rishab shetty gave speech about Environmental protection
Kantara : గత ఏడాది కన్నడ పరిశ్రమలో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్టుగా నిలిచిన చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ్ హీరోయిన్ గా నటించింది. కేజీఎఫ్ నిర్మాతలు నిర్మించిన ఈ మూవీ 16 కోట్లతో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేసింది. స్విట్జర్లాండ్ జెనీవాలో జరిగే ఐక్యరాజ్య సమితిలో కాంతార సినిమాని ప్రదర్శించే అరుదైన గౌరవం లభించింది.
Kantara : కాంతార-2 కన్‌ఫార్మ్ చేసిన నిర్మాత.. సీక్వెల్ కాదు ప్రీక్వెల్!
అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ గురించి తెలుపుతూ వచ్చిన కాంతార మూవీ నేడు (మార్చి 17) ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ స్క్రీనింగ్ కి రిషబ్ శెట్టి కూడా హాజరయ్యాడు. స్క్రీనింగ్ అనంతరం రిషబ్ శెట్టి ఐక్యరాజ్య సమితిలో పర్యావరణ పరిరక్షణ గురించి ప్రస్తావించాడు. ”పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కలిపిస్తూ పలు భారతీయ సినిమాలు తెరకెక్కాయి. నా సినిమా కాంతారలో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించము. పర్యావరణ సవాళ్లను స్వీకరించి, సంబంధిత సమస్యలను పరిష్కరించేలా ఇటువంటి సినిమాలు స్ఫూర్తిని ఇస్తాయి” అంటూ భారతీయ చిత్రాలు పర్యావరణ పరిరక్షణలో ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయో చెప్పుకొచ్చాడు.
Kantara 2: క్రేజీ న్యూస్.. కాంతార-2లో సూపర్ స్టార్.. నిజమేనా?
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఐక్యరాజ్య సమితిలో స్క్రీనింగ్ అయిన మొదటి సినిమాగా కాంతార రికార్డు క్రియేట్ చేసింది. కాగా కాంతార 2 ని తీసుకు రాబోతున్నట్లు ఇటీవల దర్శక నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కడం లేదు, ప్రీక్వెల్ గా రాబోతుంది. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. 2024 చివరికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని తెలియజేశారు.
#RishabShetty addressed infront of UN Delegates, Geneva ?#Kantara @shetty_rishabpic.twitter.com/HZECdhadDC
— ??? | ????????? ??? ?????? (@Karnatakaa_BO) March 16, 2023