Karnataka Polls: ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. కాంగ్రెస్, బీజేపీ, హంగ్.. ఈ మూడింటిలో ఏది నిజం?

ఎన్నికల ప్రక్రియలో ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ చాలా ప్రధానమైనవి. సాధారణంగా ప్రిపోల్‌ను ఎన్నికల ముందు నిర్వహిస్తారు. కానీ, ఎగ్జిట్ పోల్స్‭ని ఎన్నికలు జరిగే రోజే నిర్వహించడం గమనార్హం. పోలింగ్ బూత్‌లో ఓటు వేసి వచ్చాక ఓటర్లకు నిర్వాహకులు నిర్దిష్టమైన ప్రశ్నలు వేస్తారు

Karnataka Polls: ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. కాంగ్రెస్, బీజేపీ, హంగ్.. ఈ మూడింటిలో ఏది నిజం?

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఒపీనియన్ పోల్స్‭కు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఒపీనియన్ పోల్స్ ఫలితాల్లో ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ అనుకూలంగా ఫలితాలు ఉంటాయని జోస్యం చెప్పాయి. ఎగ్జిట్ ఫలితాలు కూడా అలాంటి జోస్యాన్నే చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే హంగ్ అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాజిక్ నంబరుకు అటుఇటుగా సీట్లు సాధిస్తుందని ఎక్కువ సర్వేలు చెప్పాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..

పీపుల్స్ పల్స్

శ్రీ ఆత్మ సాక్షి సర్వే

జీ న్యూస్, టీవీ9 భారత్ వర్ష్

వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్
Karnataka-Exit-Polls

రిపబ్లిక్ టీవీ
బీజేపీ 88-98
కాంగ్రెస్ 99-109
జేడీయూ 21-26
ఇతరులు 2-6

ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు?
ఎన్నికల ప్రక్రియలో ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ చాలా ప్రధానమైనవి. సాధారణంగా ప్రిపోల్‌ను ఎన్నికల ముందు నిర్వహిస్తారు. కానీ, ఎగ్జిట్ పోల్స్‭ని ఎన్నికలు జరిగే రోజే నిర్వహించడం గమనార్హం. పోలింగ్ బూత్‌లో ఓటు వేసి వచ్చాక ఓటర్లకు నిర్వాహకులు నిర్దిష్టమైన ప్రశ్నలు వేస్తారు. ఇది ఎంపిక చేసిన పోలింగ్ బూత్‌లలోనే జరుగుతుంది. ఓటర్లు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఎక్కువ మంది ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేశారో లెక్కగడతారు. వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి ఇదే విధంగా సమాచారం సేకరిస్తారు. దీని ఆధారంగా పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్యపై అంచనాలు కడతారు.