Hijab Row: హిజాబ్‌పై స్పందించి క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

కర్ణాటక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ హిజాబ్ అంశంపై స్పందించిన తీరుకు క్షమాపణలు చెప్తున్నారు. ఇండియాలో మహిళలు ముఖాలపై ముసుగు ధరించకపోవడాన్ని రేపు కేసులతో పోల్చడంపై క్షమించమని ...

Hijab Row: హిజాబ్‌పై స్పందించి క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Karnataka Congress Mla Comments On Hijab Row

Updated On : February 15, 2022 / 7:21 AM IST

Hijab Row: కర్ణాటక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ హిజాబ్ అంశంపై స్పందించిన తీరుకు క్షమాపణలు చెప్తున్నారు. ఇండియాలో మహిళలు ముఖాలపై ముసుగు ధరించకపోవడాన్ని రేపు కేసులతో పోల్చడంపై క్షమించమని ట్విట్టర్ ద్వారా కోరారు.

‘దేశంలో మహిళలపై అట్రాసిటీ కేసులు, రేప్ కేసులు వరుసగా పెరుగుతుండటంపై ఆందోళనకు గురయ్యాను. ఎందుకంటే మన సమాజం ఉన్న పరిస్థితి అలాంటిది. కనీసం ఈ బుర్ఖాలు ధరించడం వల్లనైనా ఈ అత్యాచారాల నుంచి తప్పించుకోవచ్చని అన్నా. ఇందులో ఎవరినో కించపరచాలనో, తప్పుడు అర్థంతోనే అనలేదు. ఎవరైనా బాధపడేలా మాట్లాడి ఉంటే దాని పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా’

‘మన పూర్వీకులు బుర్ఖా-హిజాబ్ ధరించడాన్ని మతపరంగా తప్పనిసరి చేశారు. ఈ నమ్మకం ఆధారంగానే అలాంటి స్టేట్మెంట్ ఇచ్చా. మరే ఇతర కారణం లేదు’ అని అందులో పోస్టు పెట్టాడు.

Read Also: అంతర్గత సమస్యలపై మీ ప్రేరణ అవసర్లేదు

‘హిజాబ్ ఉద్దేశం.. బాలికలు ఎదిగిన తర్వాత వాళ్ల అందాన్ని ముసుగు వెనుక దాచుకుంటారు. వాళ్లు అందం బయటకు కనిపించనివ్వరు. ఇండియాలో రేప్ కేసులు ప్రపంచంలోనే అధికంగా కనిపిస్తున్నాయి. దానికి కారణం మహిళలు బుర్ఖా లేదా పర్దా ధరించకపోవడమే’ అంటూ కామెంట్ చేశారు జమీర్ అహ్మద్.