పెళ్లిళ్లలో మాస్కులతో పాటు మార్షల్స్ ఉండాల్సిందే లేదంటే కఠిన చర్యలు : ప్రభుత్వం హెచ్చరిక

పెళ్లిళ్లలో మాస్కులతో పాటు మార్షల్స్ ఉండాల్సిందే లేదంటే కఠిన చర్యలు : ప్రభుత్వం హెచ్చరిక

karnataka gov to field marshals in marriages : దాదాపు ఖతం అయిపోయిందనుకుంటున్న కరోనా మహమ్మారి దేశంలో మరోసారి పంచా విసురుతోంది. మ‌హారాష్ట్ర స‌హా కొన్ని రాష్ట్రాల్లో రెండోసారి కరోనా విజృంభిస్తుండటంతో కేసులు సంఖ్య పెరుగుతోంది. దీంతో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి పెళ్లిళ్ల‌ు చేసుకునేవారు..పబ్లిక్ ఈవెంట్ల‌ు చేసుకునేవారు తప్పనిసరిగా మార్ష‌ల్స్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. వేడుకలకు మార్షల్స్ ఏంటిరా బాబూ అనుకుంటున్నారా? అదే మరి ఈ కరోనా కాలంలో వచ్చిన మార్పుల్లో ఇదికూడా భాగం అయిపోతోంది. వేడుకల్లో మార్షల్స ఏం చేస్తారనే కదూ మీ డౌటు..

పెళ్లిళ్లకు..పఆయా వేడుకలకు హాజ‌ర‌య్యే వాళ్లు క‌చ్చితంగా కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చూడ‌ట‌ం ఈ మార్షల్స్ పని. అలాగే వివాహాలతో పాలు పలు వేడుకలకు హాజ‌రయ్యేవారంతా కొవిడ్ నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కర్ణాటక ఆరోగ్య శాఖామంత్రి సుధాకర్ సూచించారు. పలు కార్య‌క్ర‌మానికి వెళ్లిన‌ప్పుడు మాస్క్ పెట్టుకుని తాను వెళితే తీసేయ‌మ‌ని అడిగార‌ని క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ మంత్రి సుధాక‌ర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మంత్రినైన తననే మాస్క్ తీసేయమన్నారు అంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటీ?కాబట్టి పెళ్లిళ్ల‌తోపాటు ప‌బ్లిక్ ఈవెంట్ల‌లో మార్ష‌ల్స్‌ను నియ‌మించాల‌ని నిర్ణ‌యించామని తెలిపారు.

కాగా ఇటువంటి కార్య‌క్ర‌మాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈ మ‌ధ్యే మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. వేడుకలు జరిగే హాల్ సామ‌ర్థ్యంలో స‌గం లేదా గ‌రిష్ఠంగా 500 మంది వ‌ర‌కే అనుమ‌తులను ఇచ్చింది. అయితే మ‌హారాష్ట్ర‌లాంటి ప‌రిస్థితి త‌మ‌కు రాకుండా ఉండాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ కరోనా కాలంలో పలు కార్యక్రమాల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కొన్ని క‌ఠిన నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తోంది. కేర‌ళ‌, మ‌హారాష్ట్ర నుంచి క‌ర్ణాట‌క‌కు వ‌చ్చేవాళ్లు కొవిడ్ నెగ‌టివ్ రిపోర్ట్‌తోనే రావాల‌ని ఇప్పటికే స్ప‌ష్టం చేసింది.
పలు రాష్ట్రాలతో పాటు క‌ర్ణాట‌క‌లో కూడా కొవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే గ‌త వారం బెంగ‌ళూరులోనే 2 వేల కేసులు న‌మోద‌య్యాయి అంటే పరిస్థితి ఏరకంగా ఉందో ఊహించుకోవచ్చు..