KarnataKa High Court : ఖైదీని పెళ్లి చేసుకోవడానికి ప్రియురాలు పిటీషన్ .. హత్య కేసులో దోషికి హైకోర్టు బెయిల్
ప్రేమించినవాడు హత్య కేసులో దోషిగా నిర్దారణ అయి జైలులో శిక్ష అనుభవిస్తున్నా ఆమె ప్రేమ తగ్గలేదు. ప్రేమించినవాడినే పెళ్లి చేసుకోవాలనుకుంది.అందుకోసం కోర్టును ఆశ్రయించింది.నేరస్థుడిని వివాహం చేసుకుందని సమాజం అనుకున్నా ఫరవాలేదు..నేను ప్రేమించినవాడికి పెరోల్ ఇవ్వండీ పెళ్లి చేసుకుంటానని కోర్టును వేడుకుంది. కోర్టు 15 రోజులు పెరోల్ మంజూరు చేసింది.

Karnataka HC
KarnataKa High Court : ప్రేమించినవాడు హత్య కేసులో జైలు పాలయ్యాడు. పెద్దలు వేరే వ్యక్తితో పెళ్లి చేయటానికి యత్నిస్తున్నారు. దీంతో ప్రియురాలు నా ప్రియుడ్ని పెళ్లి చేసుకోవాలి లేదంటే నా తల్లిదండ్రులు నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు..కాబట్టి నేను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవటానికి అనుమతి ఇవ్వాలని కోరుతు ఓ యువతి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ప్రియురాలితో పాటు హత్య కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవించే ఖైదీ తల్లి కూడా కోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ పై విచారించిన ధర్మాసనం సదరు ఖైదీకి 15 రోజులు పెరోల్ మంజూరు చేసింది.
రాజస్థాన్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఇటువంటి కేసు..2017లో బాంబే హైకోర్టులో ఇచ్చిన మరో కేసును పరిశీలించిన కర్ణాటక హైకోర్టు ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆనంద్ అనే యువకుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవటానికి 15రోజులు షరతులతో కూడిన పెరోల్ మంజూరు చేసిది. హత్య కేసులో 10 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న ఆనంద్ బెంళూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో 63 ఏళ్ల ఆనంద్ తల్లి రత్నమ్మ, ఆనద్ ప్రియురాలు 30 ఏళ్ల నీతా పెరోల్ కోరుతు కోర్టును ఆశ్రయించారు.
నీత, ఆనంద్ ఇద్దరూ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారని రత్నమ్మ,ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని,ఆనంద్‌కు పెరోల్ ఇవ్వకపోతే అతని ఎంతగానో ప్రేమించిన నీతాకు వారి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహంచేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపింది.నీతా కూడా ప్రేమించినవాడు దక్కకపోతే నా జీవితమే వ్యర్థమని..మరో వ్యక్తిని వివాహం చేసుకోటం నాకు ఇష్టం లేదని హత్య కేసులో శిక్ష అనుభవించేవాడిని పెళ్లి చేసుకుందని సమాజం ఏమనుకున్నా ఫరవాలేదు ఆనంద్ నే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా అందుకే పెరోల్ కోసం పిటీషన్ వేశానని తెలిపింది. ఇలా వారి ప్రేమను అర్థం చేసుకున్న జస్టిస్ ఎం నాగప్రసన్న ఆనంద్ కు పెరోల్ మంజూరు చేశారు. గడువు ముగిసాక ఆనంద్ తిరిగి జైలుకు వచ్చేలా చర్యలు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏప్రిల్ 5న ఆనంద్ విడుదల అయి 20వ వరకు పెరోల్ పై బయటకు వెళ్లి ప్రేమించిన అమ్మాయి నీతాను వివాహం చేసుకోనున్నాడు. ఆనంద్‌ను విడుదల చేయాలని జైలు అధికారులను జస్టిజ్ నాగప్రసన్న ఆదేశించారు.
కాగా పెళ్లి చేసుకోవటానికి పెరోల్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించగా జడ్జి ఆ వాదనను కొట్టిపారేశారు. ఇటువంటి పరిస్థితులు అసాధారణంగా వస్తుంటాయని..మానవత్వంతో వీటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.ఆనంద్ పెరోల్ గడువు ముగిసిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా చూడాలని అధికారులను ఆదేశించింది. అలాగే పెరోల్‌పై ఉన్న సమయంలో మరోనేరానికి సదరు ఖైదీ పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హత్య కేసులో ఆనంద్ కు దిగువ కోర్టు జీవిత ఖైదు విధించగా ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించగా శిక్షను కోర్టు పదేళ్లకు తగ్గించింది. దీంతో ఇప్పటికే ఆనంద్ ఆరేళ్లు శిక్షను పూర్తి చేసుకున్నారు.
Supreme Court : మీడియావన్ ఛానల్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్