Katrina-Vicky: ఏంటి.. కత్రినా-విక్కీ నిశ్చితార్ధం జరిగిపోయిందా?

బాలీవుడ్ మరో జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైందని బలంగా వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ గాసిప్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్

Katrina-Vicky: ఏంటి.. కత్రినా-విక్కీ నిశ్చితార్ధం జరిగిపోయిందా?

Katrina Vicky

Katrina-Vicky: బాలీవుడ్ మరో జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైందని బలంగా వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ గాసిప్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వ్యవహారం తెలిసే ఉంటుంది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని రెండేళ్లుగా రచ్చ సాగుతోంది. దాదాపుగా అందరు బీ-టౌన్ సెలబ్స్ పాటించే ఆచారాన్నే ఈ క్రేజీ కపుల్ కూడా ఫాలో అవుతూ వచ్చారు. అవునని చెప్పకుండా.. కాదని ఖండించకుండా ఎన్ని రూమర్స్ వచ్చినా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు.

అయితే.. సోషల్ మీడియాలో అడపాదడపా ఫోటోలు బయటకు రావడం.. డిన్నర్ మీటింగ్స్ లో కలసి కనిపించటంతో ఏదో జరిగిపోతుందని ప్రచారం మాత్రం తీవ్రంగా జరుగుతూ వచ్చేది. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు క్యాట్ అండ్ విక్కీ కౌశల్ ముసుగు తీసేద్దామని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తుంది. అది కూడా ఈ ఏడాదే పెళ్లి పీటలెక్కేందుకు కూడా సిద్దమవగా.. ఇప్పటికే ఉంగరాలు మార్చేసుకొని నిశ్చతార్ధం కూడా పూర్తి చేసుకున్నట్లుగా బీటౌన్ కోడై కూస్తుంది.

అంతేకాదు బాలీవుడ్ ఏస్ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని ఇన్ స్టాగ్రామ్ లో క్యాట్, విక్కీ నిశ్చతార్దాన్ని ప్రకటించి మళ్ళీ ఎందుకో డిలీట్ చేశాడు. భయాని డిలీట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ‘Hmmmm there are engagement rumours that they had a roka ceremony. Will wait for an official announcement till then it remains a rumour. #vickykaushal #katrinakaif.” అంటూ రాసుకొచ్చాడు. కానీ, ఎందుకో ఈ పోస్ట్ డిలీట్ చేశాడు. మరి, ఇంతకీ ఇది అఫీషియల్ ప్రకటన వరకు వస్తుందా.. లేక తూచ్ అంటారా అన్నదే చూడాల్సి ఉంది.