Kattappa : కట్టప్ప ఇంట్లో విషాదం..

తాజాగా సత్యరాజ్ ఇంట్లో విషాదం నెలకొంది. సత్యరాజ్‌ చెల్లెలు కల్పన మండ్రాదియార్‌ నిన్న మరణించారు. తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లా గాంగేయంలో నివసిస్తున్న కల్పన కొద్ది వారాలుగా......

Kattappa : కట్టప్ప ఇంట్లో విషాదం..

Satyaraj

Kattappa : తెలుగు, తమిళ్ సినిమాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్న ఆర్టిస్ట్ సత్యరాజ్‌. సత్యరాజ్ అంటే ఎక్కువ మంది గుర్తుపట్టరేమో కానీ ‘బాహుబలి’ కట్టప్ప అంటే మాత్రం అందరూ గుర్తు పట్టేస్తారు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసినా ‘బాహుబలి’ కట్టప్ప క్యారెక్టర్ తో అందరి మనసుల్లోనూ నిలిచిపోయాడు. ప్రస్తుతం కూడా తెలుగు, తమిళ్ లో చాలా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు సత్యరాజ్.

Bigg Boss 5 : బిగ్‌బాస్‌లో ర్యాంకుల పండగ.. లాస్ట్‌లో సిరి.. మరి ఫస్ట్..??

తాజాగా సత్యరాజ్ ఇంట్లో విషాదం నెలకొంది. సత్యరాజ్‌ చెల్లెలు కల్పన మండ్రాదియార్‌ నిన్న మరణించారు. తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లా గాంగేయంలో నివసిస్తున్న కల్పన కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు కోయంబత్తూరులోని ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించారు. హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఈమె మరణ వార్త విని సత్యరాజ్ చెన్నై నుంచి బయలుదేరి వెళ్లారు. చెల్లెలి మరణంతో సత్యరాజ్‌, ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సత్యరాజ్‌ సోదరి మృతి పట్ల టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.