SL Vs PAK 1st Test : బంతితో బ్యాట‌ర్ ప‌రుగు.. ర‌నౌట్ చేసేందుకు వెంట‌ప‌డిన కీప‌ర్‌.. నవ్వులే న‌వ్వులు.. వీడియో

జెంటిల్‌మన్ గేమ్ అయిన క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని స‌ర‌దా ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. తాజాగా శ్రీలంక‌(Sri Lanka), పాకిస్తాన్ (Pakistan) జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టులోనూ ఓ ఫ‌న్నీ ఇన్సిడెంట్ జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

SL Vs PAK 1st Test : బంతితో బ్యాట‌ర్ ప‌రుగు.. ర‌నౌట్ చేసేందుకు వెంట‌ప‌డిన కీప‌ర్‌.. నవ్వులే న‌వ్వులు.. వీడియో

Ball stuck inside Abrar Ahmed pad

SL Vs PAK : జెంటిల్‌మన్ గేమ్ అయిన క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని స‌ర‌దా ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. తాజాగా శ్రీలంక‌(Sri Lanka), పాకిస్తాన్ (Pakistan) జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టులోనూ ఓ ఫ‌న్నీ ఇన్సిడెంట్ జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు పెడుతున్నారు. అస‌లేం జ‌రిగిందంటే..?

రెండు టెస్టు మ్యాచుల సిరీస్ కోసం పాక్ జ‌ట్టు శ్రీలంకలో ప‌ర్య‌టిస్తోంది. అందులో భాగంగా గాలే వేదిక‌గా తొలి టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. మూడో రోజు ఆట‌లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. పాక్ పదకొండో బ్యాటర్ అయిన‌ అబ్రార్ అహ్మద్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్నింగ్స్ 120వ ఓవ‌ర్‌ను ర‌మేశ్ మెండీస్ వేశాడు. మెండీస్ బాల్ వేయ‌గా అహ్మ‌ద్ బంతిని అంచ‌నా వేయ‌లేక‌పోయాడు. ట‌ర్న్ అయిన బంతి అహ్మ‌ద్ గ్లోవ్‌ను తాకుతూ అత‌డి ఎడ‌మ కాలి ప్యాడ్‌లో ఇరుక్కుపోయింది.

Rohit Sharma : బ‌ర్త్‌డే బాయ్‌నే గిఫ్ట్ అడిగిన రోహిత్ శ‌ర్మ‌.. పాపం ఇషాన్ కిష‌న్ ఇచ్చేనా..!

లంక ఆట‌గాళ్లు ఎల్భీ అంటూ అంపైర్‌కు అప్పీలు చేశారు. అంపైర్ తిర‌స్క‌రించాడు. బంతి కింద ప‌డ‌క‌పోవ‌డంతో అబ్రార్ అహ్మ‌ద్ త‌న కాళ్ల‌ను షేక్ చేసిన ఫ‌లితం లేక‌పోయింది. అదే స‌మ‌యంలో లంక వికెట్ కీప‌ర్ సదీర సమరవిక్రమ వెంట‌నే బంతిని తీసుకునేందుకు అత‌డి వ‌ద్ద‌కు వ‌చ్చాడు. అది గ‌మ‌నించిన అబ్రార్‌.. అత‌డిని ఆట‌ప‌ట్టించాల‌ని ముందుకు ప‌రిగెత్తాడు.

అయితే.. ర‌నౌట్ అవుతానేమోన‌ని బావించిన అబ్రార్ వెంట‌నే బంతిని కింద ప‌డేసి స‌మ‌ర విక్ర‌మ బాల్‌ను ప‌ట్టుకోక‌ముందే వెన‌క్కి తిరిగి క్రీజులో ప‌రిగెత్తాడు. అబ్రార్ చేసిన ప‌నికి లంక ఆట‌గాళ్ల‌తో పాటు పాక్ ప్లేయ‌ర్ల ముఖాల్లో న‌వ్వులు విర‌బూశాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో నుంచి చూస్తున్న పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం ప‌డి ప‌డి న‌వ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

IND vs WI : భార‌త్‌తో రెండో టెస్టు.. యువ ఆల్‌రౌండ‌ర్‌కు పిలుపు.. భార‌త బ్యాట‌ర్ల‌ను స్పిన్ ఉచ్చులో బంధించేందుకు..!

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే శ్రీలంక మొద‌టి ఇన్నింగ్స్‌లో 312 ప‌రుగులు చేయ‌గా పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో పాక్‌కు 149 పరుగుల ఆధిక్యం ల‌భించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక నాలుగో రోజు టీ విరామానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసింది.

Babar Azam : అయ్యో.. ఆజాము..! సెంచ‌రీ ఎక్క‌డ‌.. ఇంకో 87 ప‌రుగులు చేసుంటేనా..?