Keerthy Suresh : రివాల్వర్‌ రీటాగా కీర్తిసురేష్‌..

తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరోయిన్ 'కీర్తి సురేష్'. తాజాగా ఈ హీరోయిన్ కొంచెం కొంతగా ట్రై చేస్తూ ఒక డిఫరెంట్ లేడీ ఓరియంటెడ్ సినిమాతో రాబోతుంది. ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

Keerthy Suresh : రివాల్వర్‌ రీటాగా కీర్తిసురేష్‌..

Keerthy Suresh new movie Revolver Rita first look poster released

Keerthy Suresh : తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరోయిన్ ‘కీర్తి సురేష్’. మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి నటిగా ఫుల్ మార్కులు కొట్టేసింది. ఆ సినిమాతో ఆడియన్స్ లో కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఇక ఈ భామకి ఉన్న ఫేమ్ ని చూసి మేకర్స్.. తనతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఆశక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్.. గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా వంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటించింది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

Keerthy Suresh : మహానటి మహా నిర్మాతగా మారనుందా??

అయితే ఈసారి కొంచెం కొంతగా ట్రై చేస్తుంది. ‘రివాల్వర్‌ రీటా’ అనే సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది. సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ 90 కాలం నాటి లుక్ లో కనిపిస్తుంది. అలాగే రెండు చేతిలో రివాల్వర్‌స్ పట్టుకొని క్రేజీగా కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ ని కౌ బాయ్ తరహాలో డిజైన్ చేశారు. మొత్తానికి టైటిల్ అండ్ పోస్టర్ ఆడియన్స్ బాగా ఆకట్టుకోవడమే కాకుండా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.

కాగా ఈ సినిమాని కన్నడ దర్శకుడు చంద్రు డైరెక్ట్ చేస్తున్నాడు. ది రూట్‌, ప్యాషన్‌ స్టూడీయోస్‌ బ్యానర్‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. కాగా కీర్తి సురేష్ తెలుగులో రెండు సినిమాలో నటిస్తుంది. ఒకటి చిరంజీవి భోళాశంకర్.. ఈ సినిమాలో చిరుకి చెల్లిగా కనిపించబోతుంది. మరో సినిమా నాని దసరా.. ఈ చిత్రంలో కీర్తి డీ గ్లామర్స్ పాత్రలో కనిపించబోతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరాకి సంబంధించిన కొత్త పోస్టర్ ని కూడా ఈరోజు రిలీజ్ చేశారు మేకర్స్.